దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. క్రితం రోజున భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు నేడు (ఆగస్టు 7) కూడా గణనీయంగా క్షీణించాయి. పసిడి, వెండి ధరల్లో వరుస తగ్గింపులతో కొలుగోలుదారుల్లో డబుల్ జోష్ కనిపిస్తోంది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.400 తగ్గి రూ.63,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.440 తగ్గి రూ. 69,270 వద్దకు వచ్చింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.400 క్షీణించి రూ.63,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 440 తగ్గి రూ.69,420 లకు దిగొచ్చింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.700 తగ్గి రూ.63,300 వద్దకు, 24 క్యారెట్ల బంగారం అయితే రూ.760 తరిగి రూ.69,060 వద్దకు వచ్చి చేరింది.
వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో నేడు వెండి రేటు కేజీకి రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.87,000 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment