ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం(Gold)లో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Price) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100 చొప్పున పెరిగింది.
చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.100 దిగజారి రూ.77,600 వద్దకు చేరింది.
సిల్వర్ ధరలు
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగినట్లే వెండి ధరల్లో మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర కేజీకి రూ.100 పెరిగి రూ.99,000కు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Comments
Please login to add a commentAdd a comment