మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక మంచి శుభవార్త. గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలు కొద్ది రోజుల అంతకంతకూ పడిపోతున్నాయి. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.500(1 శాతం)పైగా పడిపోయి రూ.51,715 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం ధరలు ఒక వారానికి పైగా కనిష్టస్థాయికి పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీని పెంచడానికి ముందు అమెరికా ఆదాయం పెరగడం, పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి కారణాల చేత బంగార ధరలు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ ధరలకు అనుగుణంగా భారతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కరోజులో సుమారు రూ.5,00కి పైగా బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.500కి పైగా తగ్గి రూ.51,564కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.47,771 నుంచి రూ.47,233కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.48,100 నుంచి రూ.47,600కు తగ్గింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.540 తగ్గి రూ.51,930కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. వెండి ధర రూ.1900కి పైగా తగ్గి రూ.67,349కి చేరుకుంది.
(చదవండి: ఆ రెండు నగరాల మధ్య.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే!)
Comments
Please login to add a commentAdd a comment