బంగారం కొనుగోలుదారులకు షాక్! | Gold Price On Oct 1: Gold rises RS 508, Silver Jumps RS 1169 | Sakshi
Sakshi News home page

Gold Price Hike: బంగారం కొనుగోలుదారులకు షాక్!

Published Fri, Oct 1 2021 7:59 PM | Last Updated on Fri, Oct 1 2021 8:01 PM

Gold Price On Oct 1: Gold rises RS 508, Silver Jumps RS 1169 - Sakshi

బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాక్. పసిడి ధర మళ్లీ భారీగా పెరిగింది. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగియడంతో డాలర్ విలువ భారీగా పడిపోవడం, చైనా ఆర్ధిక పరిస్థితుల ప్రభావం బంగారంపై పడింది. దీంతో ఒక్క రోజులోనే రూ.500 పైగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.45,959 నుంచి రూ.46,467కు పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు రూ.500 పెరిగి రూ.42,564 చేరుకుంది.

ఇక హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో రూ.390పెరిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగడంతో రూ.43,050కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ.1100కి పైగా పెరిగి రూ.59,408కు చేరింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement