బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా? | Today Gold And Silver Prices June 9th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?

Published Sun, Jun 9 2024 11:31 AM | Last Updated on Sun, Jun 9 2024 12:23 PM

gold price today silver rate june 9

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జూన్‌ 9) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున ఏకంగా రూ.2000లకు పైగా దిగొచ్చిన తులం బంగారం ఈరోజు పెరగకుండా  స్థిరంగా కొనసాగడంతో కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 71,670 వద్ద కొసాగుతున్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.71,820 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,700లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.71,670 లుగా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.72,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,670 వద్ద ఉంది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజున వెండి ధర కేజీకి అత్యంత భారీగా రూ.4500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement