స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు గత వారం దూసుకెళ్లాయి. విదేశీ పెట్టుబడులు కొంతమేరకు మార్కెట్లకు జోష్ ఇచ్చాయి. ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్లు విదిస్తున్న కారణంగా కరోనా త్వరలో తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. రాబోయే 2 నెలల పాటు కరోనా కేసులు ఇలాగే ఉండి ఆ తర్వాత తగ్గుతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అందువల్ల ఈ స్వల్ప కాలంలో బంగారంపై పెట్టుబడి పెడితే కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగల కొనుగోళ్లు కాస్త పెరిగాయి. అందుకే బంగారం ధరలు కూడా దూసుకుపోతున్నాయి.
మే 5 వరకు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్చమైన 10 క్యారెట్ల బంగారం ధర రూ.280 వరకు పెరిగింది. మే 7న దీని ధర రూ.47,575గా ఉంది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,579 నుంచి రూ.43,834కు పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610లో ఎటువంటి మార్పు లేదు. పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాములు ప్యూర్ గోల్డ్ ధర మాత్రం రూ.510 తగ్గి రూ.48,670కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.71,073 నుంచి రూ.71,967కు చేరింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment