
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గత కొద్ది రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరల్లో నేడు కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,248 నుంచి రూ. 48,475కు తగ్గింది. ఇక బంగారం ఆభరణం తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,111 నుంచి రూ.44,403కు పడిపోయింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,740కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.49,890కి చేరిది. చాలా కాలం తర్వాత 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేల దిగువకు చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధర రూ.71,638 వద్దకు చేరుకుంది.
చదవండి: టయోటా కార్లపై భారీ ఆఫర్లు
Comments
Please login to add a commentAdd a comment