గత వారం భారీగా బంగారం ధరలు పడిపోయిన తర్వాత నేడు భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసిఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ధర 0.24% పెరిగి రూ.47,185 చేరుకుంటే, సిల్వర్ ధర 0.05% తగ్గి కిలోకు రూ.67,730గా ఉంది. ఈ నెలలో బంగారం ధర భారీగానే తగ్గింది. జూన్ 1న రూ.49,500గా ఉన్న ధర నేడు రూ.47,000లకు చేరుకుంది. అంటే కేవలం 21 రోజుల్లో రూ.2,500 వరకు తగ్గింది అన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లలో, బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు బంగారం ఔన్స్ ధర 1,784.14 డాలర్లుగా ఉంది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110గా ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర రూ.220 పెరగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,100కు చేరుకుంది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. నేడు వెండి ధర రూ.67,548గా ఉంది.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment