
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో గూగుల్ తన AI అసిస్టెంట్ 'జెమినీ' మొబైల్ యాప్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ యాప్ ఇప్పుడు భారతదేశంలో ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
గూగుల్ జెమినీ యాప్‌లో తనకు కావాల్సిన అంశం గురించి సెర్చ్ చేయవచ్చు లేదా వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇది చదువుకొని వారికి కూడా ఉపయోగపడుతుంది. మొత్తం 9 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారుడు స్థానిక భాషలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.
మేము స్థానిక భాషలను జెమిని అడ్వాన్స్‌డ్‌కి జోడించడంతోపాటు ఇతర కొత్త ఫీచర్‌లను రానున్న రోజుల్లో తీసుకువస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమై ఉందని, త్వరలోనే ఐఫోన్ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Exciting news! 🇮🇳 Today, we're launching the Gemini mobile app in India, available in English and 9 Indian languages. We’re also adding these local languages to Gemini Advanced, plus other new features, and launching Gemini in Google Messages in English. https://t.co/mkdSPZN5lE
— Sundar Pichai (@sundarpichai) June 18, 2024
Comments
Please login to add a commentAdd a comment