Gopala Polyplast Penny Stock: కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పుంజుకున్న మార్కెట్ ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోక తప్పదు. ఏడాదికి కాలంలోనే సెన్సెక్స్ 20 వేల పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో లక్షల కోట్లలో మదుపరులు లాభపడ్డారు. ఈ మధ్య యువత మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్ జోరందుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. లక్షల పెట్టుబడుతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరికొందరు మాత్రం మార్కెట్ పై సరైన జ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడంతో చేతులు కాల్చుకుంటున్నారు.
తాజాగా ఒక కంపెనీ షేర్ ధర 154 రేట్లకు పైగా పెరిగింది. గోపాల పాలిప్లాస్ట్ షేర్లు కొనుగోలు చేసినవారి జాతకాలు ఏడాది కాలంలో మారిపోయాయి. గత ఏడాది అక్టోబర్ 29న రూ.4.51గా ఉన్న షేర్ ధర సరిగ్గా ఏడాది కాలం తర్వాత నేడు బిఎస్ఈలో రూ.772గా ఉంది. అంటే కేవలం ఏడాది సమయంలో 15,477 శాతానికి పైగా పెరిగింది. ఇక సెన్సెక్స్ గత సంవత్సర కాలంలో 50 శాతం పెరిగింది. ఈ నెల అక్టోబర్ 19న బిఎస్ఈ ప్రతి షేరు ధర రూ.1,286.95 ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గత ఏడాది రూ. 1 లక్ష రూపాయలు విలువ గల గోపాల పాలిప్లాస్ట్ స్టాక్ కొని ఉంటే ఇప్పుడు వారి ఆస్తి రూ.1.54 కోట్లు పెరిగేది.
అందుకే, అంటారేమో స్టాక్ మార్కెట్లో జీవతాలు ఒక్క ఏడాదిలో మారిపోతాయని. చాలా మందికి ఈ మార్కెట్ మీద నెగెటివ్ అభిప్రాయం ఉంది. దీనికి గల కారణం ఎటువంటి మార్కెట్ పరిజ్ఞానం లేకపోవడంతో కొంత మంది లక్షలలో నష్టపోతున్నారు. దీనితో ఈ మార్కెట్ మీద నెగెటివ్ అభిప్రాయం ఉంది. కానీ, మార్కెట్ మీద పట్టున వారి నష్ట పోయిన వారి శాతం చాలా తక్కువగా ఉంది. అందుకే, ఒకసారి పెట్టుబడి పెట్టెముందు ఒకటి రెండు సార్లు ఆ కంపెనీ పూర్వ, భవిష్యత్ చరిత్ర తెలుసుకొని పెట్టుబడి మంచిది అని మార్కెట్ నిపుణుల అభిప్రాయం.
(చదవండి: ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరు మార్పు వెనుక అసలు కారణం ఇది?)
Comments
Please login to add a commentAdd a comment