న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఓఎఫ్‌ఎస్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీలో 20 శాతం వాటాను ఆఫర్ ఫర్‌సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తోంది. గురువారం ఇష్యూ మొదలైన రోజునే ఈ ఓఎఫ్‌ఎస్ 1.98 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు (శుక్రవారం) రిటైల్ ఇన్వెస్టర్లు తమ బిడ్‌లను దాఖలు చేసుకోవచ్చు. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్‌ధరను రూ.1,367గా కంపెనీ నిర్ణయించింది.
రూ.4,374 కోట్ల నిధులు....
ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 15% వాటాకు సమానమైన 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. అదనంగా సబ్‌స్క్రైబ్ కావడంతో మరో 5% వాటా(80 లక్షల షేర్లను) గ్రీన్ షూ ఆప్షన్(అదనంగా బిడ్‌లు వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు)గా అట్టేపెట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,374 కోట్లు సమకూరుతాయని అంచనా.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో కేంద్ర ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ నిబంధనలను పాటించాలంటే ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంటుంది. భారత రైల్వేలకు ఐఆర్‌సీటీసీ కంపెనీ కేటరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను విక్రయిస్తోంది. ఈ కంపెనీ 2019, అక్టోబర్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.645 కోట్లు సమీకరించింది.
ఓఎఫ్‌ఎస్ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ షేర్ 10 శాతం నష్టంతో రూ.1,452 వద్ద ముగిసింది.
జోరుగా ఐఆర్‌సీటీసీ వాటా విక్రయం!
Published Fri, Dec 11 2020 6:25 AM | Last Updated on Fri, Dec 11 2020 6:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment