న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్‌నర్స్ 5.96 శాతం వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)లో భాగంగా 2,15,64,517 షేర్లను సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.96 శాతం వాటాకాగా.. బుధవారం షేరు ధర దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 1,332.75 వద్ద ముగిసింది. ఈ ధరలో చూస్తే జీక్యూజీ పెట్టుబడి విలువ రూ. 2,900 కోట్లకు చేరింది.
కాగా.. గత వారం ఓఎఫ్‌ఎస్‌ను చేపట్టిన పతంజలి ఫుడ్స్ షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరలో 2.53 కోట్ల షేర్ల(7 శాతం వాటా)ను ఆఫర్ చేసింది. తద్వారా కంపెనీలో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు మాతృ సంస్థ పతంజలి ఆయుర్వేద తెరతీసింది. దీంతో పతంజలి ఫుడ్స్‌లో పతంజలి ఆయుర్వేద వాటా 80.82 శాతం నుంచి 73.82 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం జూన్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌తోపాటు ఇతర విదేశీ సంస్థలు.. అదానీ గ్రూప్ కంపెనీలలోనూ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment