ఆర్థిక మంత్రిని కోరిన రవాణా మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ: జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను, సహచర కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా రంగానికి సంబంధించిన అంశాలపై మంత్రి గడ్కరీకి నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం వినతిపత్రం సమరి్పంచింది. వీటిని ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి సీతారామన్‌కు గడ్కరీ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘జీవిత బీమాపై జీఎస్‌టీని విధించడం అంటే.. జీవితంలో ఎదురయ్యే అనిశి్చతులపై పన్ను వేయడమే. జీవితంలో అనిశి్చతుల రిస్క్ నుంచి కుటుంబానికి రక్షణ కలి్పంచేందుకు తీసుకునే కవరేజీపై పన్ను వేయకూడదని సంఘం భావిస్తోంది. అలాగే సామాజికంగా ఎంతో అవసరమైన ఆరోగ్య బీమాపైనా 18 శాతం జీఎస్‌టీ విధించడం ఈ విభాగంలో వృద్ధిని అడ్డుకుంటుంది.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్‌టీ ఉపసంహరణను పరిశీలించాలని కోరుతున్నాను’’అని గడ్కరీ పేర్కొన్నారు. జీవిత బీమా ద్వారా పొదుపు పథకాలను ప్రత్యేకంగా చూడాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను తగ్గింపు (నూతన విధానంలో)ను ప్రవేశపెట్టడం, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల విలీనంపైనా ఉద్యోగుల సంఘం డిమాండ్లను గడ్కరీ తన లేఖలో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment