LIC Policy
-
జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తొలగించండి
న్యూఢిల్లీ: జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను, సహచర కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా రంగానికి సంబంధించిన అంశాలపై మంత్రి గడ్కరీకి నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం వినతిపత్రం సమరి్పంచింది. వీటిని ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి సీతారామన్‌కు గడ్కరీ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘జీవిత బీమాపై జీఎస్టీని విధించడం అంటే.. జీవితంలో ఎదురయ్యే అనిశి్చతులపై పన్ను వేయడమే. జీవితంలో అనిశి్చతుల రిస్క్ నుంచి కుటుంబానికి రక్షణ కలి్పంచేందుకు తీసుకునే కవరేజీపై పన్ను వేయకూడదని సంఘం భావిస్తోంది. అలాగే సామాజికంగా ఎంతో అవసరమైన ఆరోగ్య బీమాపైనా 18 శాతం జీఎస్టీ విధించడం ఈ విభాగంలో వృద్ధిని అడ్డుకుంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ ఉపసంహరణను పరిశీలించాలని కోరుతున్నాను’’అని గడ్కరీ పేర్కొన్నారు. జీవిత బీమా ద్వారా పొదుపు పథకాలను ప్రత్యేకంగా చూడాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను తగ్గింపు (నూతన విధానంలో)ను ప్రవేశపెట్టడం, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీల విలీనంపైనా ఉద్యోగుల సంఘం డిమాండ్లను గడ్కరీ తన లేఖలో ప్రస్తావించారు. -
పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్‌బాల్’.. ప్రత్యేకతలివే..
గతంతో పోలిస్తే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ చదివించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. చిరుద్యోగులైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లైనా, ప్రభుత్వోద్యోగులైనా, వ్యాపారులైనా తమ పిల్లలకు మెరుగైన విద్యాభ్యాసానికి మొగ్గు చూపుతున్నారు. మున్ముందు ఉన్నత విద్యాభ్యాసం కోసం భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయాలని భావించే వారి కోసం ‘అమృత్ బాల్’ అనే పాలసీ తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్, సేవింగ్స్ జీవిత బీమా పథకం. మెచ్చూరిటీ కాలం.. ఇటీవలే ప్రారంభమైన ఈ బీమా పాలసీని పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేసే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారు. ఇందులో అతి తక్కువ బీమా చెల్లింపు గడువు ఉంటుంది. సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ కూడా ఉంది. పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం 18-25 ఏళ్ల వయసు మధ్య బీమా పాలసీ మెచ్యూరిటీ వస్తుంది. 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా ఈ పాలసీ అప్లయ్ చేయొచ్చు. గరిష్టంగా 13 ఏండ్ల వయసు గల పిల్లల పేరిట తీసుకోవచ్చు. పాలసీ కనిష్ట మెచ్యూరిటీ 18 ఏళ్లు, గరిష్ట వయసు 25 ఏళ్లుగా నిర్ణయించారు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు ఉంటుంది. ప్రతి రూ.1000కి ఏటా జమ అయ్యే సొమ్ము.. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉన్నది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం కనీస పాలసీ టర్మ్ ఐదేండ్లు, గరిష్ట పాలసీ టర్మ్ 25 ఏళ్లు ఉంటుంది. కనీస సమ్ హామీ రూ.2 లక్షలు ఉంటుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితుల్లేవు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావసరాలను పరిగణనలోకి తీసుకుని, వారి ప్రీమియం చెల్లింపు ఆధారంగా పాలసీ తీసుకొవచ్చు. బీమా పాలసీపై ప్రతి రూ.1000 లకు ఏటా రూ.80 చొప్పున పాలసీ ఉన్నంత కాలం కలుస్తుంది. పాలసీ చెల్లింపు సమయంలో పాలసీదారుడికి ఏదేనా జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్లు అందిస్తారు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. చెల్లింపుల వివరాలు.. ఈ పాలసీ కింద రుణం కూడా తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ -1లో ఏడు రెట్లు, ఆప్షన్-2లో పది రెట్ల రిటర్న్స్ ఉంటాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్-3లో 1.25 రెట్లు, ఆప్షన్-4 ప్రకారం 10 రెట్లు బెనిఫిట్ ఉంటుంది. ఐదేళ్ల ప్రీమియం ఆప్షన్-1 కింద రూ.99,625, ఆప్షన్ 2 కింద రూ.1,00,100, ఆరేళ్లు ప్రీమియం ఆప్షన్ -1 కింద రూ.84,275, ఆప్షన్ -2లో రూ.84,625, ఏడేళ్లు ప్రీమియం టర్మ్ ఆప్షన్ -1 కింద రూ.73,625, ఆప్షన్ -2లో రూ.73,900 చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పాలసీలో ఆప్షన్-3 కింద రూ.3,89,225, ఆప్షన్ -4 కింద రూ.4,12,600 చెల్లించాల్సి ఉంటుంది. -
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్..!
ఎట్టకేలకు బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే నెల(మే) 4న ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 902–949 ధరల శ్రేణి నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనుంది. పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు షేరు ధరలో డిస్కౌంట్ ప్రకటించింది. న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎల్ఐసీ లిస్టింగ్ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా తొలుత అనుకున్న 5 శాతం వాటాస్థానే 3.5 శాతాన్నే విక్రయించేందుకు నిర్ణయించింది. వెరసి 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 21,000 కోట్లు లభించగలవని ఆశిస్తోంది. కాగా.. ఎల్ఐసీ పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటిని రూ. 60 డిస్కౌంట్ ధరలో విక్రయించనుంది. 15 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటితోపాటు రిటైలర్లకు రూ. 40 డిస్కౌంట్ ధరలో షేర్లను జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2న షేర్ల జారీ ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం మే 2న షేర్ల జారీని చేపట్టనుంది. పాలసీదారులు, వాటాదారులకు రిజర్వ్ చేయగా మిగిలిన వాటాలో 50 శాతాన్ని అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనుంది. క్విబ్‌లో 60 శాతం వరకూ యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం తొలుత 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగానే సెబీ నుంచి ఆమోదముద్ర పొందింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఫలితంగా 3.5 శాతం వాటా విక్రయానికే ఆఫర్‌ను పరిమితం చేస్తూ తాజా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కనీసం 5 శాతం ఎల్ఐసీ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ప్రభుత్వం మదింపు చేసింది. సెబీ నిబంధనల ప్రకారం రూ. లక్ష కోట్ల విలువగల కంపెనీ ఐపీవోకు వస్తే కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వం 5 శాతం వాటా ఆఫర్ నిబంధనల నుంచి ఎల్ఐసీకి మినహాయింపులను కోరింది. చదవండి: ఎల్ఐసీ అమ్మకంతో ఆరు లక్షల కోట్లు! -
హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ఎల్ఐసీ పాలసీలు..నిమిషానికి ఎంతంటే..?
ముంబై: ప్రభుత్వరంగ ఎల్ఐసీ పాలసీల విక్రయాల్లో దూసుకెళ్లింది. 2021–22 ఆర్థిక సంవత్సరం లో 2.17 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. 2020–21లో విక్రయించిన 2.10 కోట్ల పాలసీలతో పోలిస్తే 3.54 శాతం వృద్ధి కనిపించింది. ప్రతి నిమిషానికి 41 పాలసీలను విక్రయించినట్టు ఎల్ఐసీ తెలిపింది. మొత్తం గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీల స్థూల ఆదాయం (జీఆర్పీ) 2021–22లో 12.66 శాతం పెరిగి రూ.1,43,938 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,27,768 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇండివిడ్యువల్ (వ్యక్తులకు సంబంధించి విడిగా తీసుకునే) నాన్ సింగిల్ ప్రీమియం 8.82% వృద్ధి చెంది రూ.30,016 కోట్లుగా ఉంటే, ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం సైతం 61% వృద్ధితో రూ.4,018 కోట్లుగా ఉన్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. మొదటి ఏడాది ప్రీమియం మార్కెట్లో 63.25% వాటా సంస్థ చేతిలో ఉంది. చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..? -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!
దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు ఆఫర్ సైజ్‌లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఇష్యూ ప్రైస్‌లో డిస్కౌంట్ కూడా లభించనుంది. మరోవైపు ఉద్యోగుల కోటా 5 శాతం ఉండనుంది. అయితే, ఈ ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ గతంలో సూచించింది. ఈ పక్రియను ఫిబ్రవరి 28న పూర్తి చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ గతంలో నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది. (చదవండి: అదిరిపోయే బంపరాఫర్!! 60శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ సేల్!) -
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త..!
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాలసీ ప్రీమియం కాలంలో పాలసీలను మధ్యలోనే నిలిపివేసిన పాలసీదారుల తిరిగి తమ పాలసీల పునరుద్దరణకు ఎల్ఐసీ అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు నిలిచిపోయిన తమ పాలసీని తిరిగి పునరుద్దరించుకోవచ్చు అని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారు పెరుగుతుండటంతో ఎల్ఐసీ పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించడానికి, జీవిత వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం" అని బీమా సంస్థ పేర్కొంది. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ బీమా పథకాల పాలసీదారులు ఆలస్యం రుసుములో రాయితీ పొందవచ్చు అని తెలిపింది. ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదు సంవత్సరాల్లోపు ఉన్న కొన్ని అర్హత కలిగిన పాలసీలను పునరుద్ధరించనున్నట్టు ఎల్ఐసీ తెలిపింది. అంతేకాకుండా ఆలస్య రుసుములో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!) -
ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!
ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ముందుకు తీసుకుని వస్తుంది. అందులో భాగంగా తీసుకొచ్చిన జీవన్ ఉమంగ్ అనే పాలసీకి ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోంది. ఈ పాలసీ వల్ల పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. అలాగే పాలసీ మొత్తం ప్రీమియంలు పూర్తిగా చెల్లిస్తే ఫించను తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి. జీవన్ ఉమాంగ్ పాలసీ ఇతర పాలసీలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. క్లెయిమ్ కనీస హామీ మొత్తం : రూ.2 లక్షలు గరిష్ఠ హామీ మొత్తం : పరిమితి లేదు ప్రీమియం చెల్లిండానికి కాల పరిధి(ఏళ్లలో) : 15, 20, 25, 30 కనీస వయస్సు : 90 రోజులు గరిష్ఠ వయస్సు : 55 ఏళ్లు ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన కనీస వయస్సు : 30 ఏళ్లు ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన గరిష్ఠ వయస్సు : 70 ఏళ్లు పాలసీ మెచ్యూరిటీకి గరిష్ఠ వయస్సు : 100 ఏళ్లు నెలకు రూ.1302 చెల్లిస్తే.. ఏకంగా రూ.27.60 లక్షలు లభిస్తాయి. ఒకవేళ పాలసీదారుడు పాలసీ టర్మ్‌లో మరణిస్తే.. మెచ్యూరిటీ డబ్బులను కుటుంబ సభ్యులకు అందిస్తారు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత ప్రతి ఏడాది పాలసీ మొత్తంలో 8 శాతం డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇలా 99 ఏళ్ల వయసు వరకు వస్తాయి. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ ఒకేసారి చేతికి డబ్బులు వస్తాయి. ఉదాహరణకు ఒక ఏడాది వయస్సు గల వ్యక్తి రూ.5 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 30 ఏళ్లు. అంటే 30 ఏళ్ల వచ్చే వరకు ప్రీమియం కట్టాలి నెలకు రూ.1302 పడుతుంది. 31 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది మీరు జమ చేసిన మొత్తం మీద 8 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మీరు జమ చేసిన మొత్తం ప్రతి ఏడాది రూ.40 వేలు వస్తాయి. పాలసీదారుడు 100 ఏళ్ల జీవిస్తే.. అప్పుడు ఒకేసారి దాదాపు రూ.27.60 లక్షలు వస్తాయి. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం. జీవిత బీమాతో పాటుగా, మెచ్యూరిటీ తర్వాత ఏకమొత్తంలో డబ్బు లభిస్తుంది. మెచ్యూరిటీ తరువాత, మీ ఖాతాలోనికి ప్రతి సంవత్సరం స్థిర ఆదాయం డిపాజిట్ చేయబడుతుంది. మరోవైపు, ఏకమొత్తం చెల్లింపు పాలసీదారుని కుటుంబ సభ్యులకు నామినీ మరణం తరువాత వస్తుంది. ఈ ప్లాన్ మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది 100 సంవత్సరాల వరకు మిమ్మల్ని కవర్ చేస్తుంది. (చదవండి: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు న్యూఇయర్ బంపర్ గిఫ్ట్..!) -
ఎల్ఐసీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఏ విధంగా ధరఖాస్తు చేసుకోవాలి..?
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. దేశంలోని ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. ఎప్పటికప్పుడు పాలసీదారుల కోసం కొత్త కొత్త పాలసీలు తీసుకొని వస్తూ వారికి అండగా ఉంటుంది. ఒకవేల ఆ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి. తెలియకపోతే ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే, డెత్ క్లెయిం ఫైల్ చేసే ప్రక్రియ ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి. డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దీని కోసం ముందుగా మీరు పాలసీ జారీ చేసిన హోమ్ శాఖను సంప్రదించాలి. ఆ బ్యాంచ్‌కి వెళ్లేముందు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలి. డెత్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకాన్ని తీసుకోవాలి.(చదవండి: పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!) ఎల్ఐసీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా చేయాలి..? డెత్ క్లెయిం ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి, పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ హోమ్ బ్రాంచీని నామినీ సందర్శించాలి. నామినీ పాలసీదారుడి మరణం గురించి వారికి తెలియజేయాలి. నామినీ బ్యాంకు ఖాతాలోకి నిధుల బదిలీ కోసం బ్రాంచ్ అధికారి ఫారం 3783, ఫారం 3801, ఎన్‌ఈఎఫ్‌టి ఫారాలను ఇస్తారు. పైన పేర్కొన్న ఫారాలతో పాటుగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ల్లో ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డు కాపీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఏదైనా ఐడి రుజువు(ప్రాధాన్యతగా ఆధార్ కార్డు). పూర్తిగా నింపిన ఫారాలు, డాక్యుమెంట్లతో పాటుగా నామినీ డిక్లరేషన్ ఫారమ్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణం గురించి పేర్కొనాల్సి ఉంటుంది. ఎన్‌ఈఎఫ్‌టి ఫారంతో పాటు నామినీ బ్యాంకు ఖాతాదారుని పేరు, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ గల రద్దు చేసిన చెక్ లీఫ్, కాపీని నామినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు పాస్ బుక్, ఫోటోకాపీని ఇతర డాక్యుమెంట్లతో పాటుగా జతచేయకపోతే డాక్యుమెంట్లు ఆమోదించబడవు. పైన పేర్కొన్న డాక్యుమెంట్లను సబ్మిట్ చేసే సమయంలో నామినీ తన పాన్, మరణించిన పాలసీదారుడి ఐడి ప్రూఫ్, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ బ్యాంక్ పాస్ బుక్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. డెత్ క్లెయిం ప్రాసెసింగ్ కోసం డాక్యుమెంట్లు ఆమోదించడానికి ముందు ఎల్ఐసీ ఆఫీసర్ ఒరిజినల్ పాస్ బుక్ కాపీతో వెరిఫై చేస్తారు. ఈ డాక్యుమెంట్ల జాబితా కేవలం సూచనాత్మకంగా మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి. తుది మొత్తాన్ని నామినీ బ్యాంకు ఖాతాలోకి క్రెడిట్ చేయడానికి ముందు ఎల్ఐసీ అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. డాక్యుమెంట్లు ఎల్ఐసీ బ్రాంచీలో సబ్మిట్ చేసిన తర్వాత, ఎక్ నాలెడ్జ్ మెంట్ రసీదును సురక్షితంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇతర అదనపు డాక్యుమెంట్లు అవసరం లేనట్లయితే, అప్పుడు నామినీ ఒక నెల వ్యవధిలో సెటిల్ మెంట్ మొత్తాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే, ఒకవేళ ఒక నెలలోపు మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ కాకపోతే, అప్పుడు నామినీ రసీదుని తీసుకొని ఎల్ఐసీ బ్రాంచ్‌కు వెళ్లి స్టేటస్ కోసం అడగాల్సి ఉంటుంది. -
బీమా క్లెయిం తిరస్కరించడంతో ఎల్ఐసికి రూ.15.5 లక్షల జరిమానా
హైదరాబాద్: కె.రాములు అనే వృద్దుడు తన మైనర్ మనవరాళ్ల తరఫున బీమా క్లెయిం తిరస్కరణకు సంబందించి ఎల్ఐసి వ్యతిరేకంగా గతంలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25న వెల్లడించింది. క్లెయింను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనలను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి రూ.15.5 లక్షలు చెల్లించాలని ఎల్ఐసిని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదివారం ఆదేశించింది. తన కుమారుడు జీవన్ ఆనంద్ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని 2012లో తీసుకున్నట్లు పిర్యాదులో కె.రాములు పేర్కొన్నాడు. అయితే, తన కుమారుడి మరణం తర్వాత మైనర్ మనవరాళ్ల తరఫున వారి తాత రాములు జూలై 6, 2012న ఎల్ఐసికి బీమా క్లెయింను సమర్పించారు. 'మృతుడు తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారాన్ని వెల్లడించకుండా, ప్రస్తుత పాలసీని తీసుకునేటప్పుడు తన మునుపటి పాలసీల గురుంచి తెలపడంలో విఫలమయ్యాడు' అనే కారణంతో బీమా క్లెయింను తిరస్కరించింది. పిర్యాదులో పేర్కొన్న ప్రకారం మరణించిన వ్యక్తి తన పాలసీలో కేవలం ఒక విషయం గురుంచి మాత్రమే ప్రకటించలేదని బెంచ్ తెలిపింది. జూన్ 13, 2012 నాటి డిశ్చార్జ్ సారాంశం ప్రకారం, బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27, 2011న తీసుకున్నట్లు ధర్మాసనం గుర్తించింది. "ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేసినట్లు రికార్డులో ఏమీ లేదు" అని బెంచ్ తెలిపింది. జిల్లా వినియోగదారుల ఫోరం 9% వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని ఎల్ఐసిని ఆదేశించింది. అలాగే పరిహారంతో పాటు ఫిర్యాదుదారుడికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని పేర్కొంది. -
ప్రతి నెల పదివేల పెన్షన్ కావాలా?
దేశ వ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంది ఖాతాదారులు ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకొస్తుంది. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో సరికొత్త పెన్షన్ పథకం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పథకంలో చేరడానికి గడువు తేదీని 2023 మార్చి 31 వరకు పొడగించింది. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై వార్షిక ఆదాయం 7.66 శాతం వరకు పొందవచ్చు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు. అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు వారికీ ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనకకు తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. చదవండి: ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు! -
అల్ప ఆదాయ వర్గాల కోసం ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ!
దినసరి ఆదాయం తక్కువగా ఉన్న కార్మికుల కోసం ఎల్ఐసీ ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చింది. తక్కువ ఆదాయం గల వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీ తీసుకోని వచ్చింది. ఈ పాలసీ పేరే ఎల్ఐసీ మైక్రో బచత్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడానికి భారీ మొత్తం అవసరం లేదు. చాలా తక్కువ డబ్బుతో ఇందులో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఇది. ఎల్ఐసీ అంటే ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం ఉంది. ఇది నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ పొందొచ్చు. రక్షణతోపాటు రాబడి కూడా లభిస్తుంది. ఆకారణం చేత పాలసీదారుడు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ డబ్బులు వస్తాయి. ఇంకా ఈ పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. 18 ఏళ్లు నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 వేలకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.2 లక్షల మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు కలిగిన వారు రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఇప్పుడు సంవత్సరానికి రూ.10,320 ప్రీమియం చెల్లించాలి. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలకు పైగా లభిస్తాయి. చదవండి: పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ -
LIC Children Money Back Plan: పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ
మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా?, అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది ఒక మనీ బ్యాక్ పాలసీ. అంటే పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ అవసరాలు తగ్గట్టుగా డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో చేరాలంటే పిల్లల వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల పేరుతో పాలసీ తీసుకోవచ్చు. పిల్లల మెచ్యూరిటీ వయస్సు 25 ఏళ్లు వచ్చేవరకు పాలసీ గడువు ఉంటుంది. పాలసీ వ్యవధి పిల్లల వయస్సుపై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా 25 సంవత్సరాలు కాగా, కనీసం 13 సంవత్సరాలు. ఈ పాలసీకి కనీస మొత్తం 1 లక్ష రూపాయలు అయితే గరిష్టంగా పరిమితి ఏమిలేదు. వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లింపు చేయవచ్చు. ఉదాహరణకు రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలు అయితే ఏడాదికి రూ.4327 ప్రీమియం చెల్లించాలి. 5 ఏళ్లు ఉంటే రూ.5586 ప్రీమియం, 10 ఏళ్లు ఉంటే రూ.7899 ప్రీమియం, 12 ఏళ్లు ఉంటే రూ.9202 ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీ తీసుకున్న పిల్లల వయస్సు 18, 20, 22 ఏళ్లు చేరుకున్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. మీకు మొత్తం మూడు వాయిదాల్లో కలిపి 60 శాతం మనీ బ్యాక్ పొందవచ్చు. ఇక మిగిలిన 40 శాతం గడువు కాలం ముగిసిన తర్వాత బోనస్‌తో కలిపి వస్తుంది. డెత్ బెనిఫిట్ గురించి మాట్లాడితే, పాలసీ సమయంలో పిల్లవాడు చనిపోతే, తల్లిదండ్రులకు సమ్ అష్యూర్డ్, బోనస్ లభిస్తుంది. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. ఇక ప్రీమియం పేమెంట్ ఆలస్యం అయితే 15 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకుంటే పాలసీ ప్రపోజర్ అంటే పిల్లల పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తుంది. అంటే ప్రీమియంలు చెల్లించకపోయినా పిల్లల వయస్సు 25 ఏళ్ల వచ్చేవరకు పాలసీ కొనసాగుతుంది. మనీ బ్యాక్ కూడా వస్తుంది. ఈ పాలసీకి రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత సరెండర్ చేయొచ్చు. సెక్షన్ 80సీ కింద టాక్స్ మినయింపు కూడా లభిస్తుంది. చదవండి: మళ్లీ తగ్గిన బంగారం ధర! ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్! -
సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ
భారత ప్రభుత్వం ఇప్పటికే పేదల కోసం అనేక సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ఉద్దేశ్యం పేదల జీవితాల్లో వెలుగును తీసుకురావడం. ప్రధానంగా వారికీ సామాజిక భద్రత కల్పించడం. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా “ఆమ్ ఆద్మీ బీమా యోజన” భీమా పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ కింద బీమా చేసిన వ్యక్తికి చాలా ప్రయోజనాలు చేకూర నున్నాయి. ఈ పాలసీ కింద చేరిన వారు భీమా కాలంలో సహజ మరణంతో మరణిస్తే నామినీకి 30 వేల రూపాయలు లభిస్తాయి. యాక్సిడెంటల్ డెత్ కింద మరణిస్తే 75 వేల రూపాయలు అందుతాయి. ఒకవేల ఏదైనా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం కలిగితే 75 వేల రూపాయలు లభిస్తాయి. అలాగే ప్రమాదంలో రెండు కళ్ళు కోల్పోవడం, చేతులు లేదా కాళ్ళు రెండూ కోల్పోయిన వారితో పాటు ఒక కన్ను, ఒక చేయి లేదా కాలు కోల్పోవడంజరిగితే అతనికి 37,500 రూపాయలు లభిస్తాయి. ఈ బీమా పథకం కింద చేరిన తర్వాత పిల్లలకు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఇది అదనపు సేవల కిందికి వస్తాయి. దీని కింద చేరిన వారి ఇద్దరు పిల్లలు 9-12 తరగతుల్లో చదివేటప్పుడు ప్రతి నెలా 100-100 రూపాయలు లభిస్తాయి. ఆరు నెలలకు ఒకసారి జులై, జనవరి మొదటి తేదీల్లో నాలుగు సంవత్సరాల పాటు జమ అవుతాయి. ఈ పథకం కింద కుటుంబంలోని ఒక సభ్యుడిని మాత్రమే భీమా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి వయస్సు 18-59 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండటం ముఖ్యం. బీమా చేసినవారికి ఏదైనా జరిగితే అప్పుడు డబ్బు నెఫ్ట్ లేదా లబ్ధిదారుని/నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం రూ.200 ఇందులో ప్రభుత్వం రూ.100 జమ చేస్తే, బీమా చేసిన వ్యక్తి రూ.100 జమ చేయాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి గ్రామీణ ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే బీడీ కార్మికులు, వడ్రంగి, మత్స్యకారులు, హస్తకళల వంటి 24 రకాల వృత్తుల వారికి వర్తిస్తుంది. చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం -
ఎల్ఐసీ నుంచి మరో కొత్త పథకం
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ బీమా జ్యోతి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నాన్లింక్డ్, నాన్‌పార్టీస్ పేటింగ్ వ్యక్తిగత పొదుపు పథకమిది. ఈ పథకం ద్వారా బీమా రక్షణతోపాటు పొదుపును సైతం కలిపిస్తునట్లు ఎల్ఐసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వివరాల ప్రకారం పథకం గడువు ముగిశాక హామీ ఇస్తున్న మొత్తాన్ని పాలసీదారుడికి ఎల్ఐసీ చెల్లించనుంది. ఒకవేళ గడువుకంటే ముందుగా దురదృష్టవ శాత్తూ పాలసీదారు మరణిస్తే ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక మద్దతును అందివ్వనుంది. హామీలో భాగంగా తీసుకున్న పాలసీ(బేసిక్) విలువపై ప్రతీ ఏడాది చివర్లో రూ. 1,000కి రూ. 50 చొప్పున జమ (గ్యారంటీడ్ ఎడిషన్స్) చేయనుంది. రిస్క్ ప్రారంభమయ్యాక పాలసీ కాలంలో దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే.. నిబంధనల ప్రకారం బీమా విలువతోపాటు, అప్పటివరకూ జమ అయిన అదనపు మొత్తాన్ని చెల్లించనుంది. చదవండి: ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ కొత్త నిబంధనలు పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు! -
ఎల్ఐసీ: రోజుకు రూ.55 కడితే చేతికి రూ.13 లక్షలు!
న్యూఢిల్లీ: ఎల్ఐసీ అత్యంత విశ్వసనీయ సంస్థ. ఎల్ఐసి పాలసీలో ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఈ సంస్థను ప్రభుత్వం నిర్వహిస్తుంది. పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టేందుకు ఎప్పటి కప్పుడు కొత్త పాలసీలను తీసుకొస్తుంది. ఎల్ఐసీ తీసుకొచ్చిన పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీకి బాగా పేరొచ్చింది. పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. ఆ పాలసీలో కొన్ని మార్పులు చేసి కొన్ని నెలల క్రితం ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకొచ్చింది ఎల్ఐసీ. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో చేరడానికి వయస్సు 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి. కనీస బీమా లక్ష ఉండగా గరిష్ట పరిమితి లేదు. 15 నుంచి 35 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు పాలసీ దారుడు మీరు రూ.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకుందాం. మీరు 35 ఏళ్ల వయస్సులో 25 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న వ్యక్తి నెలకు రూ.1650 (రోజుకు రూ.55 ఆదా చేయాలి) చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలలకు అయితే రూ.5000 కట్టాలి. అదే ఆరు నెలలకు అయితే రూ.10,000 చెల్లించాలి. సంవత్సరానికి అయితే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ గడువులోపే పాలసీ దారుడు మరణిస్తే అప్పుడు నామినీకి రూ.5,00,000 లక్షలు లభిస్తాయి. ఈ విధంగా మొత్తం 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తరువాత పాలసీదారునికి ఎస్ఐ రూపంలో రూ.5,00,000, బోనస్ కింద రూ.5,75,000, చివరిగా అదనపు బోనస్ కింద రూ.2,25,000 లభిస్తాయి. ఈ విధంగా 60 ఏళ్ల వయస్సు నాటికీ పాలసీదారునికి మొత్తం 13,00,000 రూపాయలు లభిస్తాయి. చదవండి: బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! -
ఎల్ఐసీ పాలసీకి ఆధార్ లింక్ : అలా చేయకండి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు, మీ ఎల్ఐసీ పాలసీలకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దేశంలోనే అతిపెద్ద లైఫ్ ఇన్సూరర్ తన వెబ్సైట్లో తెలిపింది. పాలసీ హోల్డర్స్ తమ పాలసీలకు ఆధార్ లింక్ చేసుకోవడం కోసం ఎల్ఐసీ ఆన్లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. కానీ ఇటీవల ఎస్ఎంఎస్ను పంపించి.. ఆధార్‌తో ఎల్ఐసీ పాలసీని లింక్ చేసుకోవాలంటూ ఎల్ఐసీ పేరు మీద బూటకపు మెసేజ్‌లు వస్తున్నాయి. అలా వచ్చిన మెసేజ్‌ను నమ్మి, నిజంగా ఎస్ఎంఎస్తో ఆధార్‌ను లింక్ చేస్తే ఇక పాలసీదారుడి పని అంతేనని, వివరాలన్నీ లీకైపోతాయని ఎల్ఐసీ ప్రకటించింది. అలాంటి లింకుల మెసేజీలను నమ్మొద్దంటూ ఎల్ఐసీ సంస్థ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో వెల్లడించింది. సోషల్‌మీడియాలో విస్తృతంగా వస్తున్న ఆ సమాచారాన్ని, ప్రచారాన్ని నమ్మొద్దని, తాము అలాంటి ఎస్ఎంఎస్లను పంపించట్లేదనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ విధానం ద్వారానే పాలసీలను పాన్, ఆధార్‌తో లింక్ చేసుకునే ప్రక్రియను చేపడుతున్నామని ఎల్ఐసీ తెలిపింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎల్ఐసీ పాలసీల వివరాలు దగ్గర పెట్టుకోవాలి ఎల్ఐసీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. హోమ్‌పేజీలో కనిపిస్తున్న ఆధార్, పాన్‌ను ఎల్ఐసీ పాలసీలతో అనుసంధానించుకునే లింక్‌ను క్లిక్ చేయాలి. యూఐడీఏఐ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నెంబర్‌ను నమోదుచేసుకోవాలి. మీరు నమోదుచేసిన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఆధార్‌లో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని లేకపోతే, దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచు ఆఫీసును సంప్రదించి, ఆధార్ లింక్‌ను చేపట్టవలసి ఉంటుంది. చెక్లిస్టులన్నీ చదివాక, పేజీ కింద ఉన్న ప్రొసీడ్ బటన్‌ను క్లిక్ చేయాలి. దరఖాస్తులో అన్ని వివరాలు నింపిన అనంతరం, ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ విజయవంతమైనట్టు ఓ మెసేజ్ వస్తుంది. -
భార్య చనిపోయిందని..
మిర్యాలగూడ : పది సంవత్సరాలుగా మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలోనే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎల్ఐసీ పాలసీల గురించిన ఆయనకు అన్నీ తెలుసు. తన అవసరాల మేరకు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేయాలని పథకం వేసి సక్సెస్ అయ్యాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలు.. మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిషన్ తన భార్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. వాటితో తన భార్య పేరున ఉన్న రూ.2.5 లక్షల పాలసీని రెండు విడుతలుగా ఐదు లక్షల రూపాయలను డ్రా చేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. విజిలెన్స్ తనిఖీలతో బయటపడిన వైనం.. నకిలీ డాక్యుమెంట్లతో ఐదు రూ.లక్షలు స్వాహా చేసిన విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ఐసీ విజెలన్స్ అధికారులు, డివిజనల్ అధికారులతో కలిసి సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 14న సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అతడికి కార్యాలయ అధికారులు గానీ, ఏజెంట్లు గానీ సహకరించినట్లు సమాచారం. ఎవరు సహకరించారనే విషయంపై డివిజనల్ అధికారులు విచారణ చేపట్టారు. గోప్యంగా ఉంచుతున్న అధికారులు.. అక్రమాలకు పాల్పడిన ఎల్ఐసీ ఉద్యోగి సస్పెండ్ అయినా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఉద్యోగి తన భార్య పేరున డ్రా చేసిన డబ్బులు వివరాలు ఎక్కడా చెప్పడంలేదు. సదరుడాక్యుమెంట్‌లను పరిశీలించిన అధికారి ఎవరనే విషయం కూడా స్థానిక అధికారులకు తెలిసినా వెల్లడించడం లేదు. సస్పెండ్ చేశాం ఎల్ఐసీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి కిషన్ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఉన్నతాధికారులు తేల్చారు. ఆయనను వెంటనే ఈ నెల 14న సస్పండ్ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ఐసీ డివిజనల్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. – ప్రసాద్, మేనేజర్, మిర్యాలగూడ -
ముందే చేస్తే ‘హెల్త్’ బాగుంటుంది!
వయసు మీరాక బీమా చేస్తే ప్రీమియం భరించలేం కంపెనీ ఇచ్చే పాలసీతో పాటు సొంతదీ ఉండాలి రజని వయసు 23 ఏళ్లు. ఈ మధ్యే తను ఒక అడ్వర్టై జింగ్ కంపెనీలో ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. జీతం నెలకు రూ.25 వేలు. కంపెనీ ఇచ్చిన పీఎఫ్ ఖాతా, పేరెంట్స్ బహుమతిగా ఇచ్చిన ఎల్ఐసీ పాలసీ ఉన్నాయి. ఆ వయసులోని మిగతా వారిలానే రజనికి సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదీ లేదు. కంపెనీ తరఫునున్న రూ.5 లక్షల కవరేజీ తప్ప. తను కెరీర్ ప్రారంభంలో ఉంది. ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరమేంటన్నది తన అభిప్రాయం. ఇరవైలలో ఉన్న నేహా విషయాన్ని పక్కనబెడితే... ముప్ఫైలలో ఉన్న వారు కూడా చాలా మంది ఇలానే ఆలోచిస్తున్నారు. అదెంతమాత్రం మంచిదికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలొస్తే ఎక్కడ లేని డబ్బూ సరిపోదు. రూ.3 లక్షల కవరేజీ ఉన్నా సంక్లిష్టమైన సర్జరీ లేదా తీవ్ర అనారోగ్యాల బారిన పడితే 5 రోజుల హాస్పిటల్ ఖర్చులకు మించి రావడం లేదు. అలాగని వ్యక్తిగతంగా పొదుపు చేసి, ఆ మొత్తాన్ని వైద్యానికి వాడదామంటే అయ్యే పని కాదు. అందుకని సాధ్యమైనంత ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇటు పొదుపు మొత్తాలు భద్రంగా ఉంటాయి. అటు మీ కుటుంబానికీ భరోసా ఉంటుంది. రెండు రకాల ప్రయోజనాలు... వైద్య బీమాను సాధ్యమైనంత ముందు తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిది.. పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్కులు తక్కువ, దీర్ఘకాలం పాటు ఎక్కువ కవరేజీ లభిస్తుంది. రెండోది.. ఎంత ముందుగా తీసుకుంటే ప్రీమియం అంత తక్కువ. అదే నలభై ఏళ్లు వచ్చే దాకా ఆగి అప్పుడు తీసుకుంటే.. జీవిత కాలం తక్కువగా ఉంటుంది కనుక ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎంత ముందయితే.. అంత మంచిది! కంపెనీ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. సొంత పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఒకవేళ మీరో, లేదా మీ కుటుంబ సభ్యులో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు ఒకోసారి కంపెనీ ఇచ్చే పాలసీ మొత్తం చికిత్స ఖర్చులకు సరిపోకపోవచ్చు. అలాగే, మీరు రిటైరయిన తర్వాత కంపెనీ ఇచ్చే పాలసీ కవరేజీ కూడా ముగిసిపోతుంది. సొంతంగా తీసుకున్న పాలసీనే అప్పుడు అక్కరకొస్తుంది. లేకపోతే కష్టపడి పొదుపు చేసిన డబ్బును ఖరీదైన వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పోనీ అప్పుడు పాలసీ తీసుకుందామనుకుంటే 60 ఏళ్లు వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే కష్టం. ప్రస్తుతం చాలా పాలసీలు డే–కేర్ ప్రొసీజర్స్ మొదలుకుని, మెటర్నిటీ, ఓపీడీ మొదలైన వాటన్నింటికీ కూడా కవరేజీ ఇస్తున్నాయి. కాబట్టి ఆస్పత్రిలో చేరకపోయినా జీవితంలో చాలా మటుకు వైద్య ఖర్చులను ఎదుర్కొనేందుకు హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే, పాలసీ తీసుకున్నాక నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే కొన్ని రకాల అనారోగ్యాలు, ప్రత్యేక ట్రీట్మెంట్స్కు కవరేజీ వర్తిస్తుంది. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే.. అరవయ్యో పడిలోకి వచ్చేదాకా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత వైద్య ఖర్చులకు భారీ మొత్తాలను జేబులో నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు పాలసీ తీసుకోవాలనుకున్నా ప్రీమియం కూడా భారీగానే కట్టుకోవాల్సి వస్తుంది. కనుక, ఎంత ముందుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అంత మంచిది. -
ఈపీఎఫ్ నుంచి పాలసీ కట్టొచ్చు!
► కావాలంటే పీఎఫ్ సంస్థే కడుతుంది ► కానీ మీ ఖాతాలో డబ్బులుంటేనే సుమా! ► లేకపోతే పాలసీ రద్దయ్యే ప్రమాదమూ ఉంది ఎల్ఐసీ పాలసీలు మనలో చాలా మంది తీసుకుంటారు. ఉద్యోగులైతే ప్రత్యేకంగా వారి వేతనం నుంచి ప్రీమియం కట్టాల్సిన ఇబ్బంది లేకుండా భవిష్య నిధి (ఈపీ ఎఫ్)ని అందుకు ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి ఈ విష యమై అవగాహన లేదు. ఈ సదుపాయం ఎలాగో ఓసారి చూద్దాం... కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నా, ఇప్పటికే పాలసీ తీసుకుని ఉన్నా... సంబంధిత పాలసీ వివరాలను ఈపీఎఫ్‌వోకు తెలియజేసి ప్రీమియాన్ని తమ భవిష్య నిధి నుంచి చెల్లించాలని కోరవచ్చు. అయితే, ఈపీఎఫ్‌వోకు చెప్పాం కదా అని దాని గురించి పట్టించుకోవటం మానొద్దు. ఎందుకంటే బీమా పాలసీ ప్రీమియాన్ని పీఎఫ్ నుంచి చెల్లించాలని కోరిన తర్వాత మీ భవిష్యనిధి ఖాతాలో నగదు నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఈపీఎఫ్‌వో ఎలా చెల్లిస్తుంది చెప్పండి? పైపెచ్చు ఈ విషయంలో మిమ్మల్ని ఈపీఎఫ్‌వో అప్రమత్తం చేయదు కూడా. ఆ బాధ్యత పాలసీదారుడిపైనే ఉంటుంది. ఈపీఎఫ్‌వో గనక ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుందని గుర్తుంచుకోవాలి. భవిష్య నిధిలో డబ్బులున్నంత కాలం ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సదుపాయం యాక్టివ్గానే ఉంటుంది. నిధిని ఖాళీ చేసేస్తే పాలసీదారు స్వయంగా బీమా పాలసీ ప్రీమియాన్ని గుర్తుంచుకుని మరీ చెల్లించుకోవాలి. ఈపీఎఫ్‌కు హక్కులివ్వాలి... భవిష్య నిధి నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే... ఆ పాలసీపై హక్కుల్ని ఈపీఎఫ్‌వో సంస్థకు దఖలు పరచాలనే నిబంధన ఉంది. భవిష్య నిధి నుంచి పాలసీ ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఈ నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీని సరెండ్ చేయడం ద్వారా కట్టిన మొత్తంలో కొంత వెనక్కి అందుకునే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అలాగే, పాలసీపై రుణం పొందే సదుపాయం కూడా ఉంది. భవిష్య నిధిని బీమా పాలసీకి మళ్లించి అక్కడి నుంచి నిధిని తరలించుకుపోకుండా ఈ నిబంధన విధించి ఉండవచ్చు. రెండేళ్లు నిండాలి... ఈ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే ఇందుకు సంబంధించి ఫామ్ 14ను ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్‌ను ఈపీఎఫ్‌వో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి నుంచి చెల్లించడం సరైనదేనా? ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని భవిష్య నిధి నుంచి చెల్లించడం కరెక్టేనా? అన్న సందేహం సహజం. జీవితానికి బీమా పాలసీ ఎంతో కీలకమైనది. ప్రీమియం సకాలంలో చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈపీఎఫ్‌వో ప్రీమియాన్ని చెల్లించిందా? లేదా? అన్నది గడువు తేదీ తర్వాత బీమా కార్యాలయంలో తెలుసుకోవాలి. లేదంటే వెంటనే చెల్లించాలి. ఈ మాత్రం సమయం కేటాయించే తీరిక ఉంటే భవిష్య నిధి నుంచి ప్రీమియాన్ని నిశ్చింతగా చెల్లించుకోవచ్చు. ఎందుకంటే భవిష్యనిధిలో నగదు నిల్వలు లేక ఈపీఎఫ్‌వో చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. దాంతో పాలసీదారుడు రిస్క్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, భవిష్యనిధి అనేది ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చే చక్కని సాధనం. దాని నిల్వల నుంచి పాలసీ ప్రీమియం చెల్లించడం కంటే వీలుంటే సొంత బడ్జెట్ నుంచి చెల్లించటమే మంచిది. బడ్జెట్ కష్టంగా ఉంటే, వేతనం నుంచి కట్టే అవకాశం లేకపోతేనే ఈపీఎఫ్ నుంచి చెల్లించడం ఎంచుకోవాలి. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
రూ. 50 కోట్ల ప్రీమియంతో ఎల్ఐసీ పాలసీ!
పెద్దనోట్ల రద్దుతో ఎల్ఐసీకి బంపర్ చాన్స్ తగిలింది. ముంబైలోని దాదర్ బ్రాంచిలో ఇప్పటివరకు దేశచరిత్రలోనే ఎన్నడూ లేనంత అతి పెద్ద పాలసీ అమ్ముడైంది. దాని ప్రీమియమే 50 కోట్ల రూపాయలు! జీవన్ అక్షయ్ పాలసీ కోసం ఒక వ్యక్తి ఈ రికార్డు స్థాయి ప్రీమియం చెల్లించాడు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే పాలసీలు తీసుకునే వ్యాపారవేత్తలు చాలామందే ఉంటారు. ఒక ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అయితే.. ప్రతియేటా తనకు దాదాపు రూ. 15 లక్షలు వచ్చేలా రూ. 2 కోట్లతో ఓ పెన్షన్ పాలసీ తీసుకున్నాడు. అతడి వివరాలు సోషల్ మీడియాలో లీకవ్వడంతో.. సదరు బ్రాంచి అధికారులను ఎల్ఐసీ వివరణ కోరినట్లు సమాచారం. ఈ పాలసీకి నవంబర్ 30వ తేదీతోనే గడువు ముగిసిపోవడంతో రికార్డు స్థాయిలో ఆదరణ లభించిందంటున్నారు. ఈ ప్లాన్ కింద ఎల్ఐసీ ఏకంగా రూ. 2,300 కోట్ల నిధులను సాధించగలిగింది. చిన్న మొత్తాల పొదుపుతో పోలిస్తే రిటర్న్ అంత గొప్పగా లేకపోవడంతో మొదట్లో ఈ పాలసీ వైపు జనం పెద్దగా మొగ్గు చూపించలేదు. కానీ, పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో వడ్డీరేట్లు తగ్గడంతో.. మళ్లీ ఈ పాలసీకి ఆకర్షితులయ్యారు. -
రిటర్న్ వేసేశారా! మార్చుకోవచ్చులెండి!!
- ఎన్నిసార్లయినా మార్చుకోవడానికి అవకాశమిస్తున్న ఐటీ విభాగం - 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) అరె! నిన్న ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో ఎల్ఐసీ పాలసీ వివరాలు పూర్తిగా ఇవ్వలేదే!!. రిఫండ్ క్లెయిమ్ చేస్తూ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ సంఖ్యలో తప్పు దొర్లిపోయిందే!! ఇప్పుడెలా? ఇలా ఆలోచించేవారు చాలామంది. కానీ ఆన్లైన్లో ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తే ఇక అంతే!. అందుకే... ఇలాంటి వారికోసమే ఐటీ శాఖ ఇపుడు దాఖలు చేసేసిన రిటర్న్ ఫారాల్లో తప్పులుంటే దిద్ది మరోసారి... అదీ కాకుంటే ఇంకోసారి... ఇలా ఎన్నిసార్లయినా దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఐటీ రిటర్న్‌ను గడువు తేదీలోగా దాఖలు చేసిన వారు ఆ తరవాత తాము మరచిపోయిన సమాచారాన్ని చేర్చడమైనా, అప్పటికే ఇచ్చిన సమాచారాన్ని తొలగించడమైనా... ఏదైనా చేయొచ్చు. ఇలా ఎన్ని సార్లయినా మార్చి సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది ఐటీ విభాగం. 2015 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌లు వేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 31. ఈ లోగా దాఖలు చేసినవారందరూ... ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు కావలసినన్ని సార్లు తమ రిటర్న్‌లు సవరించుకోవచ్చు. అయితే రెండేళ్ల తరవాత మాత్రం ఆ అవకాశం ఉండదు. దీనిపై ‘మేక్‌మై రిటర్న్స్ డాట్‌కామ్’ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ రామ్‌చంద్ మాట్లాడుతూ... ‘‘నా క్లయింట్ ఒకరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆయనకు రిటైర్మెంట్ పొదుపు ఖాతా 401(కె) ఉంది. గతేడాది ఆయన ఇండియాలో ఉండి ఐటీఆర్-1 ఫారాన్ని నింపారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరికైనా విదేశాల్లో ఆస్తులుంటే వారు ఐటీఆర్-2 నింపాలి. తొలుత సకాలంలో రిటర్న్‌లు వేసేశారు కనక ఆయన ఇపుడు సవరించి కొత్తది దాఖలు చేసే అవకాశం ఉంది’’ అని వివరించారు. పన్ను చెల్లింపుదారు మూలధన నష్టాలను ఎనిమిదేళ్లపాటు కొనవచ్చని, ఈ లోగా మూలధన లాభాల నుంచి తీసివేయవచ్చని ఇటీవలే వచ్చిన కోర్టు తీర్పును ఆయన ఉదహరించారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రిటర్న్‌లో ఇలాంటి మార్పులు చేసుకోవచ్చునన్నారు. సవరించటం ఇలా... రిటర్ను దాఖలు చేసినపుడు పన్ను చెల్లింపుదారుకు 15 అక్షరాల గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. దాని సాయంతో రిటర్నులు సవరించుకోవచ్చు. అయితే సవరించినపుడు తప్పుడు సమాచారం కనక ఇచ్చినట్లయితే దానికి ఐటీ విభాగం పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. ఈ పెనాల్టీ చెల్లించాల్సిన పన్నులో 100 శాతం నుంచి 300 శాతం వరకూ ఉండొచ్చు. సవరణను ఆన్లైన్లోకానీ, భౌతికంగా కానీ దాఖలు చేయొచ్చు. అయితే తొలి రిటర్న్‌ను ఆన్లైన్లో వేసినట్లయితే సవరణ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఇలా చేసేటపుడు మెనూలో ఫైలింగ్ అండర్ సెక్షన్ 139(5) సెలెక్ట్ చేసుకున్నట్లయితే కావాల్సిన మార్పులు చేయొచ్చు. ఒకవేళ ఏదైనా పన్ను బకాయి ఉన్నట్లయితే దాన్ని చెల్లించవచ్చు. ఈ సవరించిన రిటర్న్ ఫైలింగ్‌కు సంబంధించి గుర్తింపు సంఖ్యనూ పొందవచ్చు. ‘‘ఒకవేళ తొలుత పేర్కొన్న పన్ను కన్నా సవరించిన పన్ను రిటర్న్‌లో మీరు చెల్లించాల్సిన పన్ను తక్కువ ఉన్నట్లయితే మీ పన్ను రిటర్న్‌పై స్క్రూటినీ జరవవచ్చు. అయితే మీ రిటర్న్‌లో అసత్యాలు లేని పక్షంలో మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే మీ క్లెయిమ్‌కు సరిపడే పత్రాలను దాఖలు చేయాలంతే’’ అని మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు అమోల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఒకసారి కన్నా ఎక్కువసార్లు రిటర్న్‌ను సవరించాల్సి వస్తే... ప్రతిసారీ తను తొలిసారి దాఖలు చేసిన తేదీని, తనకు ఇచ్చిన గుర్తింపు సంఖ్యను కోట్ చేయాల్సి వస్తుందని కూడా తెలియజేశారు. -
ఎంపీ పొంగులేటికి ఎల్ఐసీ ఏజెంట్ల వినతి
సాక్షి, ఖమ్మం : ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియూ (ఎల్‌ఐఏఎఫ్‌ఐ) కార్యవర్గం శనివారం వినతిపత్రం అందజేసింది. ఎల్ఐసీ పాలసీలపై కేంద్ర ప్రభుత్వం నూతనంగా పెనుభారం మోపుతోందని కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ పాలసీలపై కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్‌లతో ఏజెంట్లను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. జిల్లాలో వేలాది మంది ఎల్ఐసీ ఏజెంట్లుగా జీవనం సాగిస్తున్నారని వారందరికీ న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. దీనికి స్పందించిన పొంగులేటి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాసంగుల రామారావు, కామిని రమేష్, నిమ్మలగడ్డ రాము, నల్లమోతు రవీంద్రబాబు, ఎస్.సాంబశివరావు, ఎన్.సతీష్‌కుమార్, టి.నారాయణచారి, కేతేపల్లి శ్రీనివాసరావు, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.