న్యూఢిల్లీ: నెలవారీగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సేల్స్ రిటర్నులను దాఖలు చేసేందుకు మే నెలకు సంబంధించిన గడువును కేంద్రం 15 రోజుల పాటు పొడిగించింది. తాజా డెడ్‌లైన్ జూన్ 26గా ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో మే 28న సమావేశమైన జీఎస్‌టీ మండలి .. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిబంధనల సడలింపును కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కాంపోజిషన్ డీలర్లు 2020-21కి గాను వార్షిక రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును జూలై 31 దాకా పొడిగించింది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ).. ఈ మేరకు ట్వీట్లు చేసింది.
చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment