ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆదరగొట్టింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 22.8 శాతం మేర నికర లాభాలను రికార్డు చేసింది.ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి-మార్చ్ మధ్యకాలానికి 10,055.2 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే నికర లాభాలు మెరుగుపడ్డాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ 8,186.5 కోట్లను నమోదు చేసింది. ఈ ఏడాదిలో నాలుగో త్రైమాసికంలో రూ. 10,055.2 కోట్ల లాభాలనుపొందింది.
గత ఆర్థిక సంవత్సరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర ఆదాయం 36,961.3 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. 18.8 శాతం అధికంగా లాభాలను పొందింది.. చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపించింది. ఇక చివరి త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 563 బ్రాంచీలతో..7,167 మందికి ఉద్యోగావకాశాలను అందించింది.
Comments
Please login to add a commentAdd a comment