Twitter Videos Save On Your Smartphone: స్మార్ట్‌ఫోన్ మన శరీరంలో భాగమైపోయింది. ప్రయాణంలో ఉన్నా పనిలో ఉన్నా పరాకుగా ఉన్నా ఎక్కడ ఉన్నా సోషల్ మీడియాలో గడపడం తప్పనిసరిగా మారింది. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు చూడచక్కగా ఉంటాయి.. నవ్వులు పూయిస్తాయి, ఆశ్చర్యం కలిగిస్తాయి.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. సేవ్ చేసుకోవాలనిపిస్తాయి. ఇతరులకు షేర్ చేయాలనిపిస్తాయి. ట మీ ఫోన్(ఆండ్రాయిడ్)లో మీకు నచ్చిన ట్విట్టర్ వీడియోలనూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ సూచనలు పాటించండి. నచ్చిన వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోండి.
- ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియోస్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- మీ ఫోన్‌లో ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేయండి
- మీకు నచ్చిన వీడియోను ఎంచుకోండి
- షేర్’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి.
- ‘కాపీ ది లింక్ టు ట్విట్’ని నొక్కండి.
- ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియోస్ యాప్‌ని ఓపెన్ చేయండి
- లింక్‌ను పేస్ట్ చేయండి
- స్క్రీన్ బాటమ్ రైట్ సెక్షన్‌లో కనిపించే ‘డౌన్‌లోడ్’ ఆప్షన్‌ని నొక్కండి
- ఆప్షన్‌లలో మీరు కోరుకునే ‘రిజల్యూషన్’ని ఎంచుకొని డౌన్‌లోడ్ చేయండి
- మీ ఫోన్ గ్యాలరీ సెక్షన్‌లో ఆ వీడియోను చూసుకోవచ్చు
చదవండి: మొబైల్ డేటా జెట్ స్పీడ్‌తో ఫసక్! ఇలా చేస్తే కచ్చితంగా వర్కవుట్ అవుతుంది
Comments
Please login to add a commentAdd a comment