హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్, టెలికం రంగాలకు సమగ్ర సేవలు అందిస్తున్న ఐకామ్ తాజాగా యూఏఈ కంపెనీ ఎడ్జ్ గ్రూప్‌నకు చెందిన కారకల్‌తో చేతులు కలిపింది. మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఐకామ్.. అధునాతన సాంకేతికత, రక్షణ ఆయుధాల తయారీలో ఉన్న కారకల్‌తో కలిసి సైన్యానికి ఉపయోగపడే ఉత్పతులను తయారు చేయనుంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పో–2022 సందర్భంగా ఇరు సంస్థలు ఈ ఒప్పందంపై గురువారం సంతకం చేశాయి. కారకల్ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి డిజైన్, అభివృద్ధి, తయారీ కేంద్రంలో పూర్తి చిన్న ఆయుధాలను ఉత్పత్తి చేస్తామని ఐకామ్ ఎండీ పి.సుమంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment