దేశీయ స్టాక్‌మార్కెట్‌లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్‌లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతోంది. కేవలం నెలకు రూ.వెయ్యి పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.కోటి ఎలా రాబట్టాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ల వయసు తక్కువగా ఉంటే రిస్క్ తీసుకునే స్వభావం పెరుగుతుంది. ఉద్యోగంలో చేరిన 20 ఏళ్ల వయసులోని యువత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ పదవీ విరమణ సమయానికి రూ.కోటి కార్పస్‌ను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్‌లో జెరోధా, అప్‌స్టాక్స్, ఫైయర్స్, గ్రో, ఏంజిల్ బ్రేకింగ్.. వంటి చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు ఆన్‌లైన్ సేవలందిస్తున్నాయి. వీటితోపాటు ప్రముఖ బ్యాంకులు సైతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో మంచి ప్లాట్‌ఫ్లామ్‌ను ఎంచుకుని నెలకు రూ.1000 క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. 20-30 ఏళ్ల వయసు యువత ఈ విధానాన్ని సుమారు 40 ఏళ్లు పాటిస్తే ఏటా 12 శాతం వృద్ధితో ఆ డబ్బు ఏకంగా రూ.1,14,02,420 అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా 40 ఏళ్ల తర్వాత సమకూరే ఈ డబ్బు విలువ తగ్గిపోవచ్చు. అందుకు అనుగుణంగా ఏటా 10 శాతం పెట్టుబడి పెంచుకుంటూపోతే రిటైర్‌మెంట్ సమయానికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని సలహా ఇస్తున్నారు. అంటే మొదటి ఏడాది నెలకు రూ.1000 సిప్ చేస్తే తర్వాత ఏడాదిలో నెలకు రూ.1,100 ఇన్వెస్ట్ చేయాలి. అయితే రూ.కోటి మార్కును చేరాలంటే మాత్రం క్రమశిక్షణతో 40 ఏళ్లపాటు పొదుపు పాటించడం చాలా ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment