హైదరాబాద్: స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ (ఎస్‌ఏటీపీఎల్) తమ అత్యాధునిక గేర్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. మొదటి దశలో రూ. 75 కోట్లు, వచ్చే రెండు మూడేళ్లలో మరో రూ. 150 కోట్ల మొత్తాన్ని కంపెనీ వెచ్చించనుంది. దేశీయంగా విమానాలు, హెలికాప్టర్లతో పాటు అంతర్జాతీయంగా విమానాల మార్కెట్‌కు అవసరమైన విడిభాగాలను ఇందులో ఉత్పత్తి చేయనుంది.
ప్రస్తుతం ఇందులో 150 మంది వరకు ఉద్యోగులు ఉండగా, మూడేళ్లలో దీన్ని 1,000కి పెంచుకోవాలని సంస్థ యోచిస్తోంది. రఘువంశీ మెషీన్ టూల్స్, రేవ్ గేర్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. స్కంద ఏరోస్పేస్‌కు ఏటా 9 మిలియన్ డాలర్ల ఆర్డర్లు ఇవ్వనున్నట్లు రేవ్ గేర్స్ తెలిపింది. ప్లాంటు ప్రారంభ కార్యక్రమంలో రఘువంశీ ఎండీ వంశీ వికాస్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ ప్రవీణ్ పి.ఎ. తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment