కరోనా మహమ్మారి కాలంలో చాలా వ్యాపారులు కుదెలు అయినప్పటికీ కొన్ని వ్యాపారులు మాత్రం ఎన్నడూ లేనంతగా తిరిగి పుంజుకున్నాయి. అటువంటి వాటిలో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు గత రెండు సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. ఈ మహమ్మారి కాలంలో వినియోగదారులు రక రకాల తినుబండరాలపై ఆసక్తి కనబరిచారు. గురువారం కాంటార్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్-మే 2019 నుంచి ఏప్రిల్-మే 2020 మధ్య స్నాక్స్ కు డిమాండ్ 8 శాతం పెరగింది. ఆ తర్వాత సంవత్సరం ఏప్రిల్-మే 2020 నుంచి ఏప్రిల్-మే 2021 మధ్య వీటి డిమాండ్ 12 శాతం పెరిగింది.
భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి వేగంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్‌డౌన్ విధించింది. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉండటం, బయటకు వెళ్లే ఆస్కారం లేకపోవడంతో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు డిమాండ్ ఏర్పడింది. అలాగే, ప్రజలు తమ ఇంట్లో కొత్త రకంవంటకాలతో ప్రయోగాలు చేశారు. ఇంకా పట్టణాలలోని ప్రజలు బ్రాండెడ్ ఆహారాలను కొనుగోలు చేశారు. లాక్‌డౌన్ కాలంలో యూట్యూబ్ లోని ఫుడ్ మేకింగ్ వీడియోలకు డిమాండ్ ఏర్పడింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ మహమ్మారి కాలంలో అల్పాహార స్నాక్స్ కి భారీగా డిమాండ్ ఏర్పడినట్లు అని కాంటార్ తెలిపారు. ఉదాహరణకు పార్లే ప్రొడక్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ రెండూ గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదుచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment