పేద బాలికలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చేయూత | Infosys Foundation Commits Over Rs 100 Crore to Launch STEM Stars Scholarship Program | Sakshi
Sakshi News home page

పేద బాలికలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చేయూత

Published Fri, Aug 18 2023 4:21 AM | Last Updated on Fri, Aug 18 2023 4:21 AM

Infosys Foundation Commits Over Rs 100 Crore to Launch STEM Stars Scholarship Program - Sakshi

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు చెందిన సామాజిక సేవా సంస్థ ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ నిరుపేద విద్యారి్థనులకు రూ.100 కోట్లతో ‘స్టెమ్‌ స్టార్‌’ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి దశలో 2,000 మంది బాలికలకు స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది. పేరొందిన విద్యా సంస్థల్లో.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్‌ (స్టెమ్‌) విభాగాల్లో కోర్సులు చేసే, ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఇందుకు అర్హులని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

స్టెమ్‌ స్టార్‌ స్కాలర్‌షిప్‌ అన్నది ట్యూషన్‌ ఫీజులు, నివాస వ్యయాలను చెల్లించడంతోపాటు, రూ.లక్ష వరకు స్టడీ మెటీరియల్‌ కోసం ఇస్తుంది. ‘‘పేదరికం ఎంతో యువతను విద్యకు దూరం చేస్తోంది. బాలికలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మహిళలు విద్యావంతులు అయితే వారి పిల్లల స్కూలింగ్‌పై సానుకూల ప్రభావం చూపించడాన్ని గమనించొచ్చు. అందుకే స్టెమ్‌ స్టార్స్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమం ఉన్నత విద్య చదువుకోవాలనే బాలికలకు సాధికారతను కలి్పంచనుంది’’అని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సుమిత్‌ విర్మాణి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement