న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు 1.19 లక్షల కోట్ల రూపాయలను పైగా ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లుచేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 67.99 లక్షల రీఫండ్స్ ఉన్నాయి. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేసినట్లు పేర్కొంది.
"సీబీడీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2021 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 వరకు 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,19,093 కోట్లకు పైగా రీఫండ్ జారీ చేస్తుంది. 1,00,42,619 కేసుల్లో రూ.38,034 కోట్ల ఆదాయపు పన్ను కేసులలో రీఫండ్లు జారీ చేసింది. 1,80,407 కేసుల్లో రూ.81,059 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు" అని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది.
CBDT issues refunds of over Rs. 1,19,093 crore to more than 1.02crore taxpayers from 1st April,2021 to 15th November,2021. Income tax refunds of Rs. 38,034 crore have been issued in 1,00,42,619cases &corporate tax refunds of Rs. 81,059 crore have been issued in 1,80,407cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) November 18, 2021
(చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!)
Comments
Please login to add a commentAdd a comment