Lamborghini : వావ్‌... అప్పటి వరకు ఆగలేం? | Lamborghini Teases New Model Aventador S Jota In Social Media Platforms | Sakshi
Sakshi News home page

Lamborghini : వావ్‌... అప్పటి వరకు ఆగలేం?

Published Sat, Jul 3 2021 1:21 PM | Last Updated on Sat, Jul 3 2021 5:17 PM

Lamborghini Teases New Model Aventador S Jota In Social Media Platforms - Sakshi

హై ఎండ్‌ అల్ట్రా మోడ్రన్‌ లంబోర్గిని తన ఫ్యాన్స్‌కు కిర్రెక్కించే పని చేసింది. సూపర్‌ కార్‌గా పేరొందిన అవెంటడోర్‌ మోడల్‌లో నెక్ట్స్‌ వేరియంట్‌కి సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.  ఈ పోస్టులలో అవెంటడోర్‌ లుక్స్‌ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. జులైన 7న మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు లంబోర్గిని తెలిపింది.

చివరి వేరియంట్‌
సక్సెస్‌ఫుల్‌ మోడల్‌ అవెంటడోర్‌కి ఘనమైన ముగింపు పలికేందుకు లంబోర్గిని సిద్ధమైంది. 2011లో తొలిసారిగా అవెటడోర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. సూపర్‌కార్‌గా మార్కెట్‌ని ఉర్రూతలూగించింది అవెంటడోర్‌. పదేళ్లు గడిచిన తర్వాత అవెంటడోర్‌లో చివరి వేరియంట్‌ని అవెంటడోర్‌ ఎస్‌ జోటా పేరుతో లంబోర్గిని రిలీజ్‌ చేయబోతుంది. కేవలం ఒకే ఒక్క ఫోటో రిలీజ్‌ చేసి లంబోర్గిని లవర్స్‌లో ఉత్సుకతని రేపింది. 2021 జులై 7వ న కంపెనీ వెల్లడించే వివరాల కోసం ఎదురు చూసేలా చేయడంలో లంబోర్గిని విజయం సాధించింది. 

ఈవీపై ఫోకస్‌
అవెంటడోర్‌ మోడళ్లలో అత్యంత పవర్‌ఫుల్‌ కారుగా ఎస్‌ జోటా రాబోతుంది. ఇందులో 1.5 లీటర్‌ వీ 12 ఇంజన్‌ని అమర్చారు. ఈ కారు 796 హర్స్‌ పవర్‌ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా లంబోర్గిని కూడా ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌ వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న హురకాన్‌, అవెంటడోర్‌, ఉరస్‌ స్పోర్ట్స్‌ మోడళ్లలో ఒకదాన్ని పూర్తిగా ఈవీకి షిఫ్ట్‌ చేసే దిశగా లంబోర్గిని అడుగులు వేస్తోంది. 

చదవండి : హైస్పీడులో లగ్జరీ కార్‌ సేల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement