
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న సుందరం క్లేటాన్ ఎండీగా లక్ష్మి వేణు నియమితులయ్యారు. కంపెనీలో ఇప్పటి వరకు ఆమె జాయింట్ ఎండీగా ఉన్నారు. అంతర్జాతీయంగా సంస్థ విస్తరణలో లక్ష్మి వేణు కీలక పాత్ర పోషించారు. కమిన్స్, హ్యుండాయ్, వోల్వో, ప్యాకర్, దైమ్లర్ తదితర కంపెనీలు సుందరం క్లేటాన్ క్లయింట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment