సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త లీనా తివారీ ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండో స్థానాన్ని సాధించారు. తాజా నివేదికల ప్రకారం రూ. 30,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన భారతదేశపు రెండవ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. వ్యాపార మహిళా దిగ్గజాలు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా, నైకా ఫౌండర్, ఫల్గుణి నాయర్, జోహో కార్ప్‌కి చెందిన రాధా వెంబు వంటి వారి కంటే లీనా తివారీ ముందుకు దూసుకొచ్చారు.
ఫిబ్రవరి 12, 2023న నాటి ఫోర్బ్స్ వివరాల ప్రకారం ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి సంస్థ యుఎస్వీ ఇండియా ఛైర్మన్ లీనా గాంధీ తివారి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30వేల కోట్ల పైన)ను అధిగమించి భారతదేశంలో రెండో అత్యంత సంపన్న మహిళగా ఉండగా, రాజకీయవేత్త , వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ తర్వాత టాప్-1లో అన్నారు. అలాగే రూ. 21కోట్ల విరాళాలతో 2022లో భారతదేశపు అత్యంత ఉదారమైన మహిళగా లీనా తివారి నిలిచారు.
కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగాలలో భారతదేశంలోని మొదటి ఐదు స్థానాల్లో కంపెనీ ఉంది. ఇది క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాలు (APIలు), ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్ ఔషధాలను కూడా తయారు చేస్తుంది.యూస్వీకి చెందిన గ్లైకోమెంట్ అని యాంటీ-డయాబెటిక్ ఫార్ములేషన్ దేశీయ పరిశ్రమలో టాప్ 3లో ఉంది.
1961లో విఠల్ బాల కృష్ణ గాంధీ యుఎస్వీని స్థాపించారు అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు మహిళల,వారి హక్కులను గౌరవించే సంస్థగా పేరొందింది. తివారీ ఎక్కువగా ముంబైలోని సోషల్ సర్క్యూట్, పార్టీలకు దూరంగా ఉంటారు కానీ పరోపకారి అని ఫార్చ్యూన్ పేర్కొనడం గమనార్హం.
యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్ చదివారు. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ బాగా పాపులర్ అయింది. అలాగే బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త జుహీ చావ్లా తివారీ ఇద్దరూమంచి స్నేహితులు కూడా. జంతువులు, అడవులంటే ఇష్టపడే లీనాకు పాములన్నా, బల్లులన్నా పిచ్చి అట.
బాలికలకు అకడమిక్, డ్యాన్స్ , కంప్యూటర్ శిక్షణను డాక్టర్ సుశీల గాంధీ సెంటర్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్‌కి లీనా సాయం చేస్తారు. లీనా భర్త యూఎస్వీ ఎండీ ప్రశాంత్ తివారీ. వీరి కుమార్తె అనీషా గాంధీ తివారీ.మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్‌డీ చేసిన అనిషా ఆగస్టు 2022లో యూఎస్వీ బోర్డులో చేరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment