LIC appointed MD R Doraiswamy ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని నియమించినట్లు ప్రకటించింది.సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి రానున్నట్టు ఎల్‌ఐసీ ప్రకటించింది. 2026 ఆగస్టు చివరివరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దొరైస్వామి ప్రస్తుతం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా అతని పదవీ విరమణ తేదీ వరకు (అంటే 31.08.2026) వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అది అమలులోకి వస్తుందని అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతంలో ఎల్‌ఐసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా సత్‌పాల్ భానూను నియమించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం హెడ్‌హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB), ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సత్ పాల్ భానూ పేరును సిఫార్సు చేసింది.
కాగా జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ఎల్‌ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. గత ఏడాదితో ఇదే క్వార్టర్ రూ. 602.79 కోట్లతో పోలిస్తే ఈ కాలంలో లాభం 1498.4 శాతం పెరిగి రూ. 9634.98 కోట్ల లాభాలునమోదు చేసింది. అయితే నికర ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 98,755 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 2.48 శాతంగా ఉంది, ఇది క్రితం సంవత్సరం కాలంలో 5.84 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment