Doraiswamy
-
భారత హైకమిషన్‌కు ఖలిస్తాన్ నిరసన సెగ
లండన్: బ్రిటన్‌లో ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు మరోసారి పేట్రేగిపోయారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల బ్రిటన్‌లోని గ్లాస్గో పట్టణంలో గురుద్వారాలోకి భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి వెళ్లకుండా ఖలిస్తానీవాదులు అడ్డుకున్న ఘటనను మరవకముందే మళ్లీ అలాంటి నిరసన కార్యక్రమానికి బ్రిటన్ వేదికగా మారింది. సోమవారం లండన్‌లో ఈ ఘటన జరిగింది. హై కమిషన్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని నియంత్రించారు. మరోవైపు, దొరైస్వామిని అడ్డుకోవడాన్ని ఖండిస్తూ సదరు గురుద్వారా ప్రకటన విడుదల చేసింది. -
ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి
LIC appointed MD R Doraiswamy ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని నియమించినట్లు ప్రకటించింది.సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి రానున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. 2026 ఆగస్టు చివరివరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దొరైస్వామి ప్రస్తుతం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా అతని పదవీ విరమణ తేదీ వరకు (అంటే 31.08.2026) వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అది అమలులోకి వస్తుందని అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతంలో ఎల్ఐసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా సత్పాల్ భానూను నియమించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం హెడ్‌హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB), ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సత్ పాల్ భానూ పేరును సిఫార్సు చేసింది. కాగా జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. గత ఏడాదితో ఇదే క్వార్టర్ రూ. 602.79 కోట్లతో పోలిస్తే ఈ కాలంలో లాభం 1498.4 శాతం పెరిగి రూ. 9634.98 కోట్ల లాభాలునమోదు చేసింది. అయితే నికర ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 98,755 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 2.48 శాతంగా ఉంది, ఇది క్రితం సంవత్సరం కాలంలో 5.84 శాతంగా ఉంది. -
టెక్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ సంఖ్యలో సాంకేతిక ఆధారిత (టెక్) ఉద్యోగాలను సృష్టించడం ద్వారా హైదరాబాద్ ‘టెక్ పవర్‌హౌజ్’గా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, రవాణా, వస్త్రోత్పత్తి రంగాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు. యూకే పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం లండన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ కె. దొరైస్వామి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు. పుంజుకున్న పారిశ్రామికీకరణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటిపైనా దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రయత్నించామని కేటీఆర్ చెప్పారు. ఆవిష్కరణలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీంతో వ్యవసాయం, ఐటీ మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని, పారిశ్రామికీకరణ కూడా వేగం పుంజుకుందని తెలిపారు. ‘టీఎస్ఐపాస్ ద్వారా పారిశ్రామిక అనుమతుల విధానంలో పారదర్శకత, వేగం పెరిగాయి. హైదరాబాద్‌లోని ఆవిష్కరణల వాతావరణం, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల మూలంగా ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకొచ్చే సంస్థలకు సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ వెల్లడించారు. యూకే విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో తెలంగాణ చేసుకున్న భాగస్వామ్యాలను ఆయన ప్రస్తావించారు. భారత హై కమిషనర్ విక్రమ్ కే. దొరైస్వామి మాట్లాడుతూ.. భారీ యంత్రాలు, వైమానిక, రక్షణ, వినోద, విద్యారంగాల్లో యూకే కంపెనీలతో తెలంగాణ భాగస్వామ్యానికి అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తెలంగాణలో నూతన సచివాలయం, అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో సహా తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త బిల్లీమోరియా ప్రస్తావించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
పోరాటాల దొరెస్వామి అస్తమయం
యశవంతపుర: కన్నడనాట ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు హెచ్ఎస్ దొరెస్వామి (103) బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. వయోభారం, గుండె సమస్యలతో ఆయన జయదేవ ఆస్పత్రిలో ఇటీవల చేరారు. కరోనా సోకడంతో మే 8న జయదేవ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకోవడంతో నయమై 13న ఇంటికి చేరుకున్నారు. 17న గుండె సమస్య రావడంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం గుండె పనిచేయడం ఆగిపోవడంతో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. ఆయన అంతిమసంస్కారాలను కోవిడ్ నియామాలను పాటిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ‘నాకు వయసైపోయింది. నాకు ఆస్పత్రిలో బెడ్ అక్కర్లేదు. యువతకు బెడ్ కేటాయించండి’అని పదేపదే చెప్పేవారని ఆస్పత్రి వైద్యులు గుర్తుచేసుకున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా పోరాటాలను పక్కనపెట్టి ఇంటికే పరిమితమయ్యారు. టీచర్ నుంచి క్విట్ ఇండియా బరిలోకి హరోహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి 1918 ఏప్రిల్ 10న బెంగళూరు సమీపంలోని హరోహళ్లిలో జని్మంచారు. బెంగళూరు సెంట్రల్ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. తరువాత ఓ హైసూ్కల్లో సైన్స్, గణిత ఉపాధ్యాయునిగా మారిన ఆయన 1942లో గాం«దీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్‌వారిని హడలగొట్టేందుకు చిన్నసైజు టైమ్‌బాంబులను ప్రభుత్వ ఆఫీసుల్లోని రికార్డు రూమ్‌లు, పోస్ట్‌బాక్స్‌లలో ఉంచేవారు. 1943లో బాంబులతో పోలీసులకు పట్టుబడడంతో జైలు పాలయ్యారు. 14 నెలల కారాగారవాసం తరువాత విడుదలయ్యాక స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తూ పలు పత్రికలను స్థాపించి స్వరాజ్య స్ఫూర్తిని రగిల్చారు. స్వాతంత్య్రం తరువాత సైతం స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలోని అసమానతలపై దొరెస్వామి దృష్టి సారించారు. 1950లలో భూదాన్ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీని విధించబోతున్నట్లు ముందుగానే గ్రహించిన దొరెస్వామి అప్పటి ప్రధాని ఇందిరాగాం«దీని నియంతతో పోలుస్తూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతానని గళమెత్తారు. జయప్రకాష్ నారాయణ్ సోషలిస్టు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. కర్ణాటక, బెంగళూరుకు సంబంధించిన అనేక ప్రజా సమస్యల పోరాటాల్లో ముందున్నారు. బెంగళూరులో అన్నాహజారే చేపట్టిన అవినీ తి వ్యతిరేక ఉద్యమంలోను సంఘీభావం తెలిపారు. ఎక్కడ ప్రజాందోళనలు జరిగినా అక్కడ దొరె స్వామి ఉంటారని పేరుగాంచారు. ఆయనకు భార్య లలితమ్మ, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. లలితమ్మ రెండేళ్ల కిందట కన్నుమూశారు. దొరె స్వామి కర్ణాటక అంతరాత్మ అంటూ ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్ర యడియూరప్ప సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. -
అన్నాడీఎంకే నేతల ఇంళ్లలో ఐటీ దాడులు
తమిళనాడులో సోమవారం ఏకకాలంలో 40 చోట్ల పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథం, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరైస్వామి, ఆయన కుమారుడి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖాధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో పలు శాఖలు కలిగి ఉన్న ప్రముఖ బంగారు నగల దుకాణంపై కూడా దాడులు జరిపారు.