ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) భారత్‌లో అతిపెద్ద బీమా కంపెనీలలో ఒకటి. సామాన్యులకు విభిన్నమైన పాలసీలను అందిస్తూ వారికి పెద్ద మొత్తంలో లాభాలను అందిస్తోంది ఎల్‌ఐసీ. పెట్టుబడి దారులకు సురక్షితమైన, రిస్క్ లేని పాలసీలను ఎల్‌ఐసీ అందిస్తోంది. పిల్లల చదువులు, పదవీ విరమణ వంటి వాటికి ఆర్థిక భద్రతను ఎల్‌ఐసీ తన పాలసీదారులకు ఇస్తోంది. పాలసీలను ఎలాంటి అవాంతరాలు లేకుండా కట్టినట్లఐతే భారీ మొత్తంలో లాభాలను పొందవచ్చును.
రోజుకు రూ. 262తో రూ. 20 లక్షలు
ఎల్‌ఐసీ అందిస్తోన్న పాలసీల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాలసీ జీవన్ లాభ్. ఈ పాలసీను 2020 ఫిబ్రవరి 1న ఎల్‌ఐసీ ప్రారంభించింది. ఈ పాలసీ ద్వారా.. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు మరణించినా, నామినీకి ఈ పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత రుణాలు కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. డెత్ బెనిఫిట్, పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ సహా వంటి వాటిని కూడా ఈ పాలసీ ద్వారా పొందవచ్చును. ఎల్‌ఐసీ తీసుకొచ్చిన జీవన్ లాభ్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడంతో మెచ్యూరిటీ సమయానికి లక్షల రూపాయలను పొందవచ్చును. ఈ పాలసీలో భాగంగా రోజుకు రూ.262(నెలకు రూ. 7, 916) చొప్పున నిర్ణిత గడుపులోపు కట్టినట్లయితే.. దాదాపుగా రూ.20 లక్షల వరకు తిరిగి పొందే అవకాశం ఉంది.
జీవన్ లాభ్ పాలసీ మరిన్ని వివరాలు
ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ కనీస బీమా మొత్తం రూ.2 లక్షల నుంచి మొదలుకానుంది. ఈ పాలసీ బీమాపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. బీమా పరిమితిని ఎంత పెంచితే నెలవారీ ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ పాలసీకి కనీసం 8 ఏళ్ల మెచ్యురిటీ ఉంది. అయితే ఈ పాలసీ టైం పీరియడ్‌ను 16, 21, 25 ఏళ్లకు పెంచుకోవచ్చును. 8 నుంచి 59 ఏళ్ల వారు ఈ పాలసీలో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ పాలసీలను నెలవారీగా లేదా 3,6 నెలల వారిగా, ఏడాదికి ఒకసారి ప్రీమియంను చెల్లించే వెసులుబాటును ఎల్‌ఐసీ కల్పిస్తోంది. ఇక నెలవారీ చెల్లింపులపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
చదవండి: వెయిట్ చేసినందుకు...ఎలాంటి కష్టం లేకుండా రూ. 1.35 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు..!
Comments
Please login to add a commentAdd a comment