హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. భారత్‌లో క్యాంపర్స్ వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కారవాన్ల తయారీ కంపెనీ క్యాంపర్వాన్ ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పలు మోడళ్లలో అందుబాటు ధరలో కారవాన్లను కంపెనీ రానున్న రోజుల్లో భారత్‌లో పరిచయం చేస్తుంది.
ఐఐటీ మద్రాస్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లీన్ వాటర్, సెయింట్ గోబెయిన్ రీసెర్చ్ సెంటర్ సైతం ఈ వాహనాల అభివృద్ధిలో మహీంద్రాకు సాయం చేస్తాయి. కారవాన్ విభాగంలో ఇటువంటి ఒప్పందం భారత వాహన తయారీ రంగంలో ఇదే తొలిసారి అని మహీంద్రా వెల్లడించింది. ఐఐటీ మద్రాస్‌లో క్యాంపర్వాన్ ప్రాణం పోసుకుంది.
డబుల్ క్యాబ్ బొలెరో క్యాంపర్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై క్యాంపర్స్ రూపుదిద్దుకుంటాయి. కుటుంబం, స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్లేవారికి కారవాన్ వాహనాలు సౌకర్యంగా ఉంటాయి. నలుగురు కూర్చుని భోజనం చేయడానికి, పడుకోవడానికి కారవాన్‌లో ఏర్పాట్లు ఉంటాయి. బయో టాయిలెట్‌తో కూడిన రెస్ట్ రూమ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఏసీ, టీవీ వంటివి పొందుపరుస్తారు.
చదవండి: Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో
Comments
Please login to add a commentAdd a comment