మిడ్‌సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 568 పాయింట్లు కోల్పోయి 39,954 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లకు ఎదురీదుతూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ, తెరా సాఫ్ట్‌వేర్, హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్, ఎక్స్‌ప్రో ఇండియా, నహర్ పాలీఫిల్మ్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
అదానీ గ్రీన్ ఎనర్జీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 777 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బీఎస్‌ఈలో మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.66 లక్షల షేర్లు చేతులు మారాయి. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.47 లక్షల షేర్లుగా నమోదైంది.
తెరా సాఫ్ట్‌వేర్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 33 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 33.50ను తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 70,000 షేర్లు చేతులు మారాయి.
హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10.4 శాతం లాభపడి రూ. 18.5 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.55 లక్షల షేర్లు చేతులు మారాయి.
నహర్ పాలీఫిల్మ్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 91.4 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 30,000 షేర్లు చేతులు మారాయి.
ఎక్స్‌ప్రో ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం నష్టంతో రూ. 20.7 వద్ద ట్రేడవుతోంది. అయితే తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 23ను అధిగమించింది.బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 200 షేర్లు మాత్రమేకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 500 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment