న్యూఢిల్లీ: దేశంలో పవన విద్యుత్ రంగం పురోగతికి తీసుకోవాల్సిన కీలక సూచనలను పవన విద్యుదుత్పత్తి దారుల సమాఖ్య (డబ్ల్యూఐపీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బిడ్డింగ్ ప్రణాళిక, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఓపెన్ యాక్సెస్, ఆఫ్‌షోర్ విండ్‌కు సదుపాయాల కల్పన తదితర కీలక విధానాలను అమలు చేయాలని కోరింది.
జూన్ 11న గ్లోబల్ విండ్ డే కావడంతో పవన విద్యుత్‌పై అవగాహన పెంచేందుకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఆధ్వర్యంలో ఆదివారం (11న) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఎన్‌ఆర్‌ఈ జాయింట్ సెక్రటరీ దినేష్ దయానంద్ మాట్లాడుతూ.. మహా ఉర్జా, మహా డిస్కమ్, ఎంఎన్‌ఆర్‌ఈ, డెవలపర్లు, తయారీదారులు, రుణదాతలు సహకారంతో పవన విద్యు త్ విషయంలో భారత్ మరింత పురోగతి సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యాపార నిర్వహణ సులభతరం కావడంతో పునరుత్పాదక లక్ష్యాల సాధన విషయంలో మరింత దూకుడుగా పనిచేస్తామన్నారు. మన దేశం 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యా న్ని చేరుకోవాలని నిర్దేశించుకోగా.. 2023 మే నాటి కి 173.61 గిగావాట్లకు చేరుకుంది. ఇందులో పవనవిద్యుత్ సామర్త్యం 43.19 గిగావాట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment