న్యూయార్క్: ఇటీవల ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా వేగవంత వృద్ధి సాధిస్తున్న గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా మరో భారీ డీల్‌కు తెరతీసింది. నాస్‌డాక్ లిస్టెడ్ స్పీచ్ రికగ్నిషన్ కంపెనీ న్యుయాన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 16 బిలియన్ డాలర్లు(రూ. 1,20,000 కోట్లు)కాగా.. ఒక్కో షేరుకీ 56 డాలర్ల చొప్పున చెల్లించనుంది. శుక్రవారం ముగింపు ధర 45.58 డాలర్లతో పోలిస్తే ఇది 23 శాతం ప్రీమియంకాగా.. తాజా వార్తలతో సోమవారం(12) ట్రేడింగ్‌లో న్యుయాన్స్ షేరు ప్రారంభంలోనే 16.6 శాతం జంప్‌చేసింది. 53.16 డాలర్లకు చేరింది. ఇక మైక్రోసాఫ్ట్ షేరు దాదాపు యథాతథంగా 256 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
లింక్డ్‌ఇన్ తర్వాత భారీ డీల్...
రుణాలతో కలిపి న్యుయాన్స్ కమ్యూనికేషన్స్ విలువను 19.7 బిలియన్ డాలర్లుగా మైక్రోసాఫ్ట్ మదిం పు చేసింది. వెరసి ఐదేళ్ల తదుపరి భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఇంతక్రితం 2016లో లింక్డ్‌ఇన్‌ను 26 బిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ కొనుగోలు చే సింది. ఈ బాటలో గతేడాది సెప్టెంబర్‌లో వీడియో గేమ్ తయారీ సంస్థ జెనీమ్యాక్స్‌ను 7.5 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
2019 నుంచీ...
న్యుయాన్స్‌తో 2019లోనే మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. న్యుయాన్స్ కొనుగోలు ద్వారా హెల్త్‌కేర్ పరిశ్రమలో అందిస్తున్న సేవలు రెట్టింపు కానున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. న్యుయాన్స్ సీఈవోగా మార్క్ బెంజమిన్ కొనసాగనున్నట్లు తెలియజేసింది. గతేడాదిలో ప్రవేశపెట్టిన హెల్త్‌కేర్ క్లౌడ్ ప్రొడక్టులకు న్యుయాన్స్ సాంకేతికతను వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది.
న్యుయాన్స్.. మైక్రోసాఫ్ట్ సొంతం
Published Tue, Apr 13 2021 6:33 AM | Last Updated on Tue, Apr 13 2021 1:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment