Aha Video Announced A Business Reality Show Called Nenu Super Woman - Sakshi
Sakshi News home page

ఆహాలో `నేను సూప‌ర్ వుమెన్` షో, రూ.1.35 కోట్ల పెట్టుబ‌డి: కమింగ్‌ సూన్‌!

Published Thu, Jul 13 2023 12:56 PM

Nenu Super Woman special realyshow coming soon by aha - Sakshi

హైద‌రాబాద్‌: 100 శాతం లోక‌ల్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ద‌క్షిణ భార‌త‌ దేశంలోనే తొలిసారిగా మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం  ‘నేను సూప‌ర్ వుమెన్’   అనే బిజినెస్ రియాలిటీ షోను తీసుకొస్తోంది. జూలై 21 నుంచి ప్ర‌తి శుక్ర‌, శ‌నివారాల్లో ఈ రియాలిటీ షో  ప్రసారం  కానుంది. ఈ  రియాలిటీ షోకు శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తారు.

తొలివారంలోనే ‘నేను సూప‌ర్ వుమెన్’ఏంజెల్స్ మహిళా స్టార్ట్ అప్ కంపెనీస్ లో రూ.1.35 కోట్లు పెట్టుబ‌డుల‌ను పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా. ఏంజెల్స్ మెంటార్ షిప్ అండ్‌  కార్పస్ ఫండ్ కూడా అందించనుంది.  షో కి వచ్చే 40 కంటెస్టెంట్స్  కూడా  ఈ అవకాశాన్ని దక్కించుకోవచ్చు.

ఈ ఏంజెల్స్ క‌మిటీలో డార్విన్ బాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు రోహిత్ చెన్న‌మ‌నేని, క్వాంటేలా కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ శ్రీధ‌ర్ గాంధి, సిల్వ‌ర్ నీడిల్ వెంచ‌ర్స్ రేణుక బొడ్ల‌, అభి బ‌స్ సీఈఓ, వ్య‌వ‌స్థాప‌కుడు సుధాక‌ర్ రెడ్డి, దొడ్ల డైరీ ఫౌండ‌ర్ దొడ్ల దీపా రెడ్డి, బ‌జాజ్ ఎల‌క్ట్రానిక్ క‌ర‌ణ్ బ‌జాజ్‌, నారాయ‌ణ గ్రూప్ సింధూర పొంగూరు ఉన్నారు. 

వ్యాపార రంగంలో రాణించాల‌నుకునే మ‌హిళ‌ల‌కు ‘నేను సూప‌ర్ వుమెన్’  ఓ గేమ్ చేంజ‌ర్‌ షో అని డార్విన్ బాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు రోహిత్ చెన్న‌మ‌నేని  తెలిపారు.  కొత్త ఆలోచ‌న‌ల‌తో స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టానికి ఇదొక వేదిక అన్నారు. దశాబ్దాల అనుభవాన్ని పంచుకోవటానికి వారికి గైడెన్స్ ఇవ్వటానికి తాను  సిద్ధంగా ఉన్నానంటూ  కరణ్ బజాజ్ (బజాజ్ ఎల‌క్ట్రానిక్స్) సూప‌ర్ ఉమెన్ ఎంటైర్ టీమ్‌ని అభినందించారు.

మ‌హిళవ్యాపార‌వేత్త ధైర్యంగా నిల‌బ‌డగలగుతుందో, వ్యాపార న‌మూనాల‌ను, ఆలోచ‌న‌ల‌ను గొప్ప‌గా ప్ర‌ద‌ర్శిస్తుందో,  అప్పుడే తనకు  సంతోషంగా అనిపిస్తుందని సిల్వ‌ర్ నీడెల్ వెంచ‌ర్స్ పార్ట్‌న‌ర్ రేణుక బొడ్ల  అన్నారు. మ‌హిళ‌ల్లోనే వ్యాపార స్ఫూర్తిని పెంపొందించే ఈ   ప్రయాణంలో తాను భాగ‌మ‌వుతున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో కొత్త శకానికి ఇదొక నాంది. నేను సూప‌ర్ వుమెన్, స్త్రీ సాధికార‌త‌ను పెంపెందించే  అసాధార‌ణ‌మైన వేదిక‌ ఆని డైరెక్ట‌ర్ ఆఫ్ నారాయ‌ణ కాలేజెస్ సింధూర పొంగూరు   కొనియాడారు.

క్వాంటెలా ఇన్క్ ఫౌండ‌ర్ చైర్మ‌న్ శ్రీధర్ గాంధీ మాట్లాడుతూ, ‘‘నేను సూపర్ ఉమెన్ ప్రోగ్రాం వ‌ల్ల వ్యాపారంలో రాణించాల‌నుకుంటున్న మ‌హిళ‌లు, వారి ఆలోచ‌న‌లు గురించి తెలుసుకునే గొప్ప అవ‌కాశం ద‌క్కిందనీ, మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల  సామ‌ర్థ్యానికి, సృజ‌నాత్మ‌క‌త‌తో ఓ స‌రికొత్త అర్థ‌వంత‌మైన మార్పుని తీసుకు రావ‌టంతో పాటు మ‌రిన్ని కొత్త అవ‌కాశాల‌కు మార్గాల‌ను ఏర్ప‌రుచుకున్న‌ట్లే అన్నారు.
 
వి-హ‌బ్ సీఇఓ దీప్తి రావు, ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని  ‘నేను సూపర్ ఉమెన్’ అనేది అందరిలోనూ ఓ  సానుకూలా దృక్ప‌థాన్ని ఏర్ప‌రుస్తుంద‌ని న‌మ్మ‌కాన్ని వ్యక్తం చేశారు. ‘ఓ వ్యాపారవేత్తగా మరీ ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తగా ఉండటానికి ధైర్యంతో పాటు ప‌ట్టుద‌ల‌, సంక‌ల్పం అవ‌స‌రమన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చొర‌వ‌తో వి-హ‌బ్ రూపుదాల్చిందని దీప్తి రావుల తెలిపారు. వాసుదేవ్ మాట్లాడుతూ ఆహా ఈ షో చేస్తున్నందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది. దీని ద్వారా మ‌హిళ‌ల సామ‌ర్థ్యాన్ని బ‌య‌ట పెట్ట‌టానికి ఓ వేదిక‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement