టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంప్రదాయ వైఖరికి భిన్నంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో సినిమా చూడాలంటే క్యూలైన్‌లో టికెట్ల కోసం పోరాటం చేసే పరిస్థితులుండేవి. ప్రస్తుతం ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని అరచేతిలో సినిమా చూస్తున్నారు. ఆ సౌకర్యాలు అందించే కంపెనీలు కూడా అధికమవుతున్నాయి. అయితే అవి అందించే ఫీచర్లకు భారీగా డిమాండ్ ఉండడంతో ఆ సంస్థలు కోట్లు సంపాదిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియా ఎల్‌ఎల్‌పీ 2023లో 24 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్‌ఓసీ)కు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా తెలియజేసింది. సంస్థ వార్షిక ఆదాయంలో సంవత్సరానికి 24 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ విలువ రూ.2,214 కోట్లకు చేరుకుంది. దీంతోపాటు నికరలాభం గణనీయంగా పెరిగింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 75 శాతం పెరిగినట్లు సంస్థ తెలిపింది.
డిసెంబర్ 2021లో తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరను తగ్గించాలనే నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. దాంతో ఎక్కువ మంది తమ ప్లాన్‌లను తీసుకోవడంతో నికర లాభం పెరిగినట్లు సంస్థ అంచనా వేసింది. తర్వాత క్రమంగా 2022లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. 2023లో భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. చందాదారుల సంఖ్యను పెంచడానికి భారత్‌లో కంపెనీ రూ.149 ధర కలిగిన మొబైల్ ప్లాన్‌ను ప్రచారం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..!
2023 వార్షిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 2022 కంటే 16 శాతాన్ని అధిగమించినప్పటికీ, ఇది కరోనా తర్వాత 2021తో పోలిస్తే 66 శాతం తగ్గింది. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీస్‌ల కోసం రూ.125 కోట్లు ఖర్చు చేసింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 30 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment