రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్! | NIJ Electric Scooter Accelero Plus Launch Price RS 53k, Up To 190 Km Range | Sakshi
Sakshi News home page

రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!

Published Sun, Mar 20 2022 5:58 PM | Last Updated on Sun, Mar 20 2022 6:55 PM

NIJ Electric Scooter Accelero Plus Launch Price RS 53k, Up To 190 Km Range - Sakshi

గత 2 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహన మార్కెట్లో అనేక స్టార్టప్, దిగ్గజ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈవీ రంగంలో అన్నింటి కంటే ముఖ్యమైనది రేంజ్, ధర. ఈ రెండు వాహన కొనుగోలుదారులను ఎక్కువ శాతం ప్రభావితం చేస్తున్నాయి. సరిగ్గా ఈ రెండు అంశాలను లక్ష్యంగా చేసుకొని ఎన్ఐజె ఆటోమోటివ్ తన యాక్సెలెరో+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ప్రముఖ ఎల్ఈడీ డీఆర్ఎల్, బూమరాంగ్ తరహా ఎల్ఈడీ ఇండికేటర్లతో వస్తుంది. 

190 కిలోమీటర్ల రేంజ్
ఈ స్కూటర్ ఇంపీరియల్ రెడ్, బ్లాక్ బ్యూటీ, పెర్ల్ వైట్, గ్రే టచ్ రంగులలో లభిస్తుంది. యాక్సెలెరో+లో క్రూయిజ్ కంట్రోల్ అనే ఫీచర్ ఉంది. సుదూర ప్రయాణ సమయంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్ లెడ్-యాసిడ్ బ్యాటరీ, 3 ఎల్ఎఫ్సీ బ్యాటరీ ఆప్షన్'లలో లభిస్తుంది. లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్లు 1.5 Kw (48V), 1.5 Kw (60V) & 3 Kw విత్ 48V డ్యూయల్ బ్యాటరీ సెటప్. యాక్సెలెరో+లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్‌లో ప్రయాణిస్తే గరిష్టంగా 190 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. సిటీ మోడ్‌లో ప్రయాణిస్తే గరిష్టంగా 140 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.
 

రూ.98,000 ధర
బ్యాటరీ ప్యాక్ ఆధారంగా యాక్సెలెరో, యాక్సెలెరో+ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.53,000 నుంచి రూ.98,000 వరకు ఉంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.53 వేలు, 1.5 కిలోవాట్ల వేరియంట్ ధర రూ.69 వేలు, 3 కిలోవాట్ వేరియంట్ రూ.98 వేలు లభిస్తుంది. ఈ స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, USB ఛార్జింగ్, రివర్స్ అసిస్ట్, ఛార్జింగ్ పోర్ట్‌, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్, ఐఓటి వంటి ఫీచర్లు ఉన్నాయి. లెడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌ను 3ఏ పవర్ సాకెట్‌లో ప్లగ్ చేసి చార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 6 నుంచి 8 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ను 6A సాకెట్‌లోకి ప్లగ్ చేసి.. 3 నుంచి 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఐతే ఇందులో వాడిన సింగిల్ బ్రష్‌లెస్ డీసీ మోటార్ పవర్ లేదా టార్క్ వివరాలను మాత్రం ఎన్ఐజె వెల్లడించలేదు.

(చదవండి: మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement