
సాక్షి: ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ఘనంగా లాంచ్ అయింది. ఈసందర్బంగా స్వయంగా డాన్సర్ అయిన నీతా అంబానీ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
NMACC ప్రారంభోత్సవ వీడియోలు , ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరేళ్ల వయస్సులో తన భరతనాట్య ప్రయాణాన్ని ప్రారంభించిన నీతా అంబానీ ఈ గ్రాండ్ లాంచ్ కోసం ప్రత్యేకంగా కొరియోగ్రఫీ చేసిన 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్'లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. బ్రైట్ లెహంగాలో ‘రఘుపతి రాఘవ రాజా రామ్’ అద్భుత నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. NMACC అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవానికి పలు వ్యాపార, క్రీడా ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ , జిగి హడిద్ వంటి స్టార్లతోపాటు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర, గుర్నానీ, అలాగే ప్రముఖ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, యూవీ, బుమ్రా, టెన్సిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment