
బెంగళూరు: ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఒక లెక్క నేను ఒక లెక్క అంటుంది ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ వంటివీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో హీట్ పెంచుతున్నాయి. త్వరలోనే ఈ పోటీలో చేరడానికి "ఓబెన్ ఈవీ" స్టార్టప్ కంపెనీ సిద్దం అవుతుంది. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ తన మొదటి బైక్‌ను 2022 మొదటి త్రైమాసికంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
200 రేంజ్..
2020లో బెంగళూరుకు చెందిన ఓబెన్ ఈవీ సహ వ్యవస్థాపకుడు దింకర్ పూర్తిగా 'దేశీయ' ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాలని అనుకున్నాడు. ఈ స్టార్టప్ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరీక్షించేందుకు సిద్దం అవుతుంది. ఇప్పటికే ఈ కంపెనీ ఈ బైక్ కోసం 16 పేటెంట్ హక్కులను పొందింది. బైక్ 3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, సింగిల్ ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు అని సహ వ్యవస్థాపకుడు దింకర్ పేర్కొన్నారు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.
ఓబెన్ ఈవీ సహ వ్యవస్థాపకుడు దింకర్ మీడియాతో మాట్లాడుతూ.. "మేము పూర్తిగా స్వదేశీ, పల్సర్ 180 సీసీ, 200 సీసీ బైక్‌లతో సమానంగా రైడింగ్ అనుభవాన్ని అందించే ఎలక్ట్రిక్ వాహనాన్ని సృష్టించాలనుకున్నాము" అని అన్నారు. ఈ బైక్‌ను రెండు గంటల్లోఫుల్ ఛార్జ్ చేయవచ్చు అని చెప్పారు. అదే డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద వాహనాన్ని ఒక గంటలో వేగంగా ఛార్జ్ చేయవచ్చు అని తెలిపారు. ఈ స్టార్టప్ 2022 మొదటి త్రైమాసికంలో దీనిని లాంచ్ చేయలని చూస్తుంది. ఇందుకోసం ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల ఫండ్ కూడా రైజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment