ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) శుభవార్తను అందించింది. పేటీఎం 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంకును లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్భీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు స్టేటస్‌ను ఇచ్చినట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ యాక్ట్-1934 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్భీఐ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఈ డిజిటల్ పేమెంట్ కంపెనీ ఇక కొత్త వ్యాపారాలపై ఫోకస్ పెట్టేందుకు మార్గం సులువుకానుంది.
చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..!
భారీ అవకాశాలు పేటీఎం సొంతం..!
ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎంకు వ్యాపారపరంగా భారీ అవకాశాలను సొంతం చేసుకోనుంది. ప్రభుత్వం, ఇతర పెద్ద పెద్ద కంపెనీలు జారీ చేసే రిక్వెస్ట్ ఆఫ్ ప్రొపోజల్స్(ఆర్‌ఎఫ్‌పీ)లో పేటీఎం పాల్గొనవచ్చును. దాంతో పాటుగా ప్రైమరీ వేలాల్లో కూడా పాల్గొనే అవకాశం పేటీఎంకు ఏర్పడనుంది. పేటీఎం షెడ్యూల్ బ్యాంకు స్టేటస్‌పై సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోగా...అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో ఆర్భీఐ జారీ చేసింది. కాగా షెడ్యూల్ బ్యాంకు స్టేటస్ వచ్చినట్టు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు గురువారం వెల్లడించింది.
షెడ్యూల్ బ్యాంకు స్టేటస్‌తో వచ్చే ప్రయోజనాలు
ఆర్భీఐ రూపొందించిన నిబంధనలను షెడ్యూల్ బ్యాంకులు అనుసరించాల్సిం ఉంటుంది. అంతేకాకుండా ఆర్భీఐ నుంచి రుణాలను కూడా పొందే సౌకర్యం ఉంటుంది. రోజువారీ బ్యాంకింగ్ అవసరాల కోసం ఆర్భీఐ నుంచి నగదును అప్పు తీసుకునే సౌకర్యం షెడ్యూల్ బ్యాంకులకు కల్గుతుంది.
6.4 కోట్లకు పైగా ఖాతాలు..!
మార్చి 31, 2021 నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 6.4 కోట్లకు పైగా సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, పార్టనర్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం రూ.5200 కోట్ల పైనే ఉన్నాయి.
చదవండి: పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!
Comments
Please login to add a commentAdd a comment