ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 2009 తరువాత కంపెనీ ఇంత పెద్ద లేఆఫ్స్‌కు సిద్దమవ్వడం ఇదే మొదటిసారి. ఈ లేఆప్స్ ప్రభావం అసోసియేట్స్, మేనేజింగ్ డైరెక్టర్లు, బిజినెస్ సర్వీసులు, ఆడిట్, పన్ను విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై పడే అవకాశం ఉంది.
కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువమంది అమెరికా బయట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగానే సంస్థ ఈ లేఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా కంపెనీ భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను తొలగించాల్సి వస్తున్నట్లు సంస్థ ఒక మెమోలో వెల్లడించింది.
కరోనా సమయంలో అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను దొలఁగించినప్పటికీ.. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ మాత్రం లేఆప్స్ ప్రకటించలేదు. కానీ కరోనా మొత్తం తగ్గుముఖం పట్టిన తరువాత దాదాపు రెండువేల మందిని ఇంటికి పంపే యోచన చేస్తోంది. ఈ విషయం తెలిసిన ఉద్యోగులలో ఇప్పటికే భయం మొదలైంది. అయితే ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించారనేది త్వరలోనే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment