ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ప్యూర్ ఈవీ’ 2025లో ఐపీఓగా రానున్నట్లు ప్రకటించింది. కంపెనీ బిజినెస్‌పై ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ మార్కెట్ ద్వారా మూలధనాన్ని సమకూర్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో కంపెనీ భవిష్యత్తు అవసరాలను తీర్చుకుంటూ కార్యకలాపాలను విస్తరిస్తామని పేర్కొంది.
కంపెనీకి నాట్‌కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్‌టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థల మద్దతు ఉందని ప్యూర్‌ఈవీ తెలిపింది. సంస్థలోని 85 శాతం వాటా ప్రమోటర్ల వద్దే ఉంది. ఐపీఓ ద్వారా మార్కెట్‌లో ఈ వాటాను అమ్మి డబ్బు సేకరించాలని చూస్తున్నారు. దాంతో వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.రెండు వేలకోట్ల వ్యాపారం సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కంపెనీ ఏధరతో షేర్లను విడుదల చేస్తుందనేది మాత్రం తెలియరాలేదు. ఐపీఓ తేదీ, లిస్టింగ్ తేదీ, లాట్ సైజ్..వంటి కీలక వివరాలు తెలియజేయాల్సి ఉంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈవీ తయారీలో బ్యాటరీకి ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు వాటి సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
Comments
Please login to add a commentAdd a comment