ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు టేకోవర్ చేయాలనే ప్రక్రియ ఊపందుకుని ఆరు నెలలు గడుస్తున్నా రతన్ టాటా నోటి నుంచి ఇంత వరకు ఒక్క మాట కూడా బయటకు రాలేదు. ప్రభుత్వంతో ఒప్పందం ఖరరైన సందర్భంగాలో జంషెడ్జీటాటా ఉంటే సంతోషించేవాడు అంటూ ట్వీట్ చేయడం మినహా మరే ఇతర కామెంట్లు ఆయన చేయలేదు. 2022 జనవరి 27 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అప్పుడు కూడా ఆ గ్రూపు చైర్మన్ రతన్‌టాటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
ఎట్టకేలకు రతన్ టాటా మౌనం వీడారు. ‘ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా స్వాగతం పలుకుతోంది. మీతో కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. విమాన ప్రయాణం అంటే ఎయిర్ ఇండియా అనే విధంగా కొత్త లక్ష్యాలను చేరుకోవాలి’ అంటూ రతన్ టాటా ప్రసంగించారు. ఈ మేరకు రతన్ టాటా ప్రసంగాన్ని ఎయిర్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
#FlyAI: A warm welcome extended by Mr Ratan Tata, Chairman Emeritus, Tata Sons, Chairman Tata Trusts, to our passengers onboard Air India flights. pic.twitter.com/MkVXEyrj3J
— Air India (@airindiain) February 2, 2022
చదవండి: ఇక టాటావారి ఎయిరిండియా
Comments
Please login to add a commentAdd a comment