న్యూఢిల్లీ: శ్రేయీ గ్రూప్ కంపెనీలపై బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్‌బీఐ దాఖలు చేసిన ఫిర్యాదులను జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) స్వీకరించినట్లు తెలుస్తోంది. శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, శ్రేయీ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్‌ల బోర్డులను రద్దు చేసిన ఆర్‌బీఐ పాలనాధికారిగా రజ్‌నీష్ శర్మను ఎంపిక చేసింది. ఈ రెండు కంపెనీలపై దివాలా చట్ట చర్యలకుగాను ఎన్‌సీఎల్‌టీకి ఆర్‌బీఐ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యుల కోల్‌కతా బెంచ్ ఆర్‌బీఐ ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు.. కంపెనీల నిర్వహణకుగాను పాలనాధికారి నియామకాన్ని సైతం అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు రూ. 30,000 కోట్లకుపైగా బాకీ పడిన విషయం విదితమే. కాగా.. ఆర్‌బీఐ చర్యలను వ్యతిరేకిస్తూ శ్రేయీ గ్రూప్ కంపెనీలు ముంబై హైకోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది.
Comments
Please login to add a commentAdd a comment