ఇంటి నుంచి చూస్తే సముద్రం కనిపించాలి.. ఏదీ అడ్డు రాకూడదని.. | Rekha Jhunjhunwala Purchases Neighbouring Building For Rs 118 Crore For Sea View, Know Details Inside - Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి చూస్తే సముద్రం కనిపించాలి.. ఏదీ అడ్డు రాకూడదని..

Published Sun, Mar 24 2024 5:03 PM | Last Updated on Sun, Mar 24 2024 6:48 PM

Rekha Jhunjhunwala Purchases Neighbouring Building For Rs 118 Crore For Sea View - Sakshi

బిలియనీర్ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా తన కొత్త ఇంటి నుంచి అరేబియా సముద్రం వీక్షించడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేదుకు రూ.118 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో భాగంగానే దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో వాకేశ్వర్ రోడ్‌లోని ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

రేఖా ఝున్‌ఝున్‌వాలా దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో ఖరీదైన వల్కేశ్వర్ రోడ్‌లోని ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ. 11.76 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రెసిడెన్షియల్ టవర్ రాక్‌సైడ్ అపార్ట్‌మెంట్స్‌లోని మూడవ అంతస్తులో 1,666 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో విస్తరించి ఉంది. అయితే ఇది సముద్రానికి ఎదురుగా ఉన్న రాక్‌సైడ్ సీహెచ్ఎస్ వెనుక ఉంది.

దక్షిణ ముంబైలోని వాకేశ్వర్ రోడ్‌లో ఉన్న సుమారు 50 ఏళ్లు పైబడిన రాక్ సైడ్ అపార్ట్‌మెంట్స్ సహా మరో 6 బిల్డింగ్లను క్లస్టర్ స్కీమ్ కింద పునర్నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదిక కూడా వెలుగులోకి వచ్చింది. అనుకున్న విధంగా ఈ భవనాల నిర్మాణం పూర్తయితే.. అరేబియా సముద్రాన్ని చూడటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది.

అరేబియా సముద్ర వీక్షణ కోసం రేఖా ఝున్‌ఝున్‌వాలా 2023 నవంబర్ నుంచి వివిధ డీలర్ల నుంచి తొమ్మిది అపార్ట్‌మెంట్లను రూ.118 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భవనంలోని 24 అపార్ట్‌మెంట్లలో 19 అపార్ట్‌మెంట్లను ఆమె కుటుంబానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement