ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ప్రపంచ రిటైల్ పవర్ హౌస్‌ల 2021 ర్యాంకింగ్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ రిటైలర్‌గా నిలిచింది. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ జాబితాలో గత ఏడాది 56వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 53వ స్థానంలో ఉంది. డెలాయిట్ నివేదిక ప్రకారం, ఈ జాబితాలో యుఎస్ దిగ్గజం వాల్ మార్ట్ ఇంక్ అగ్రస్థానంలో ఉంది. మరోసారి ప్రపంచంలోని అగ్రశ్రేణి రిటైలర్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. అమెజాన్.కామ్ రెండవ స్థానంలో నిలిచింది. కాస్ట్‌కో హోల్‌సేల్ కార్పొరేషన్ ఆఫ్ యుఎస్ మూడో స్థానంలో నిలిచింది, స్క్వార్జ్ గ్రూప్ ఆఫ్ జర్మనీ నాలుగో స్థానంలో నిలిచింది.
టాప్ 10లో ఏడుగురు యుఎస్ రిటైలర్లు, ఒకరు యుకె(టెస్కో పిఎల్సి 10వ స్థానంలో) ఉన్నారు. టాప్ 10లో ఉన్న ఇతర యుఎస్ రిటైలర్లలో ది క్రోగర్ కో(5 వ ర్యాంక్), వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ ఇంక్ (6వ), సీవీఎస్ హెల్త్ కార్పొరేషన్ (9వ ర్యాంక్) ఉన్నాయి. జర్మనీకి చెందిన ఆల్డి ఐంకాఫ్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్‌జి మరియు ఆల్డి ఇంటర్నేషనల్ సర్వీసెస్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్‌జీ 8వ స్థానంలో ఉన్నాయి. 250 మంది రిటైలర్ల ప్రపంచ జాబితాలో రిలయన్స్ రిటైల్ మాత్రమే భారతీయ సంస్థగా గుర్తింపు పొందడం విశేషం. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్, ప్రపంచంలోని వేగవంతమైన రిటైలర్ల జాబితాలో ఇది వరుసగా 4వ సారి ప్రవేశం పొందింది.
"రిలయన్స్ రిటైల్ కంపెనీ 41.8 శాతం వృద్ధిని నమోదు చేసింది, ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జీవనశైలి, కిరాణా రిటైల్ గొలుసులలోని దుకాణాల సంఖ్య 13.1 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరాంతంలో(ఎఫ్‌వై 20) భారతదేశంలోని 7,000 పట్టణాలు, నగరాల్లో 11,784 దుకాణాలకు చేరుకుంది" అని డెలాయిట్ ప్రతినిధులు తెలిపారు. "వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్ ప్లాట్‌ఫామ్‌లో రిలయన్స్ రిటైల్ డిజిటల్ కామర్స్ వ్యాపారాన్ని మరింత వేగవంతం చేయడానికి మరియు వాట్సాప్‌లో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి కంపెనీ వాట్సాప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది" అని తెలిపింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment