
ముంబై: గత ఏడాది నుంచి కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద భారీగానే నిదులను ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సీఎస్ఆర్ కిందరూ.1,140 కోట్లను వెచ్చించింది. ఈ విషయాన్ని సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో తెలిపింది. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న పోరాటంలో రిలయన్స్ గత ఒక సంవత్సరంలోనే ఆరోగ్య సంరక్షణ, మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్, భోజనం, మాస్కుల పంపిణీ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది.
1,000 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను గుజరాత్‌లోని జామనగర్‌లో నిర్మించింది. 27 లక్షల మందికి 5.5 కోట్లకు పైగా భోజనాన్ని పంపణీ చేసింది. కోవిడ్ సంరక్షణ, చికిత్స కోసం 2,300 పడకలను ఏర్పాటు చేసింది. 81 లక్షల మాస్క్‌లను ఫ్రంట్ లైన్ వర్కర్లకు పంపిణీ చేసింది. కరోనా సేవలకు వినియోగించే ఆంబులెన్స్‌లకు 5.5 లక్షల లీటర్ల ఇంధనాన్ని వెచ్చించింది. గ్రామీణాభివృద్ధి, ఆటలు, రిలయన్స్ ఫౌండేషన్ తరపున స్కాలర్షిప్స్ తదితర అంశాల్లో ఖర్చుచేసింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం ప్రతిరోజూ 1,00,000 పీపీఈ కిట్లు, మాస్క్‌లను ఉత్పత్తి చేయడానికి గుజరాత్‌లోని సిల్వాస్సాలో ఒక ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నివేదికలో తెలిపింది.
చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment