హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న సాగర్ సిమెంట్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10 కోట్ల నికర నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43 కోట్ల నష్టం నమోదైంది. ఎబిటా రూ.60 కోట్లు, ఎబిటా మార్జిన్ 10 శాతంగా ఉంది.
టర్నోవర్ రూ.474 కోట్ల నుంచి రూ.587 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో గురువారం 1.13 శాతం అధికమై రూ.250.55 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment