‘ఇంటర్మీడియెట్‌ పూలింగ్‌’పై నిషేధం | SEBI Announced To Ban On Intermediate Pooling | Sakshi
Sakshi News home page

‘ఇంటర్మీడియెట్‌ పూలింగ్‌’పై నిషేధం

Published Tue, Oct 5 2021 8:10 AM | Last Updated on Tue, Oct 5 2021 9:02 AM

SEBI Announced To Ban On Intermediate Pooling - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే దిశగా నిధులు, యూనిట్ల ’ఇంటర్మీడియట్‌ పూలింగ్‌’ను నిషేధించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. మ్యుచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులు, చానెల్‌ భాగస్వాములు, ప్లాట్‌ఫామ్‌లు తదితర సంస్థలకు ఇది వర్తిస్తుంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సెబీలో నమోదు చేసుకున్న పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు ఇది వర్తించదు. 

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల (ఏఎంసీ)తో లోపాయికారీ ఒప్పందాలతో కొన్ని సంస్థలు .. తమ క్లయింట్ల నిధులను ముందు నోడల్‌ ఖాతాలోకి (ఇంటర్మీడియట్‌ పూలింగ్‌), ఆ తర్వాత ఏఎంసీల ఖాతాల్లోకి లావాదేవీల ప్రాతిపదికన బదలాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సెబీ తెలిపింది. ఇలాంటి అనధికారిక లావాదేవీల వల్ల యూనిట్‌హోల్డర్లు నష్టపోతే ఏఎంసీలే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.   
 

చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్‌.. సెబీ సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement