SEBI ban
-
యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడా
సామాజిక మాధ్యమాల సాయంతో స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడే వారిపై సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంటోంది. సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా యూట్యూబ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ సాగిస్తున్న రవీంద్ర బాలు భారతి అనే వ్యక్తిపై చర్య తీసుకుంది. ఏప్రిల్ 4, 2025 వరకు సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా తాను సంపాదించిన మొత్తం రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.19 లక్షల మందికి సలహాలు..నిబంధనల ప్రకారం సెబీ రిజిస్టర్డ్ వ్యక్తులు, ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి. అందులోనూ చాలా నియామాలున్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా కొన్ని రోజులుగా రవీంద్ర బాలు భారతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టుబడి సలహాలు, స్టాక్ సిఫార్సులు చేస్తున్నట్లు సెబీ గుర్తించింది. దాంతో స్టాక్ మార్కెట్‌పై అనుభవం లేనివారే లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించినట్లు తెలిపింది. తనకు చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్‌ల్లో దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లతో పెద్దమొత్తంలో నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టుబడి సలహాలు ఇస్తూ భారీగా నగదు పోగు చేసినట్లు సెబీ పేర్కొంది.రూ.10 లక్షలు జరిమానారవీంద్ర సంపాదించిన డబ్బును రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్పై ఇన్వెస్ట్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఏప్రిల్ 2025 వరకు ఎలాంటి సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా భారతి, అతని సంస్థ, తన సహచరులపై సెబీ నిషేధం విధించింది. రవీంద్ర, తన సహచరులకు రూ.10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ మోసాలతో సంపాదించిన రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణస్వతహాగా నేర్చుకోవడం ఉండదు..సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా, బంధువులు, స్నేహితులు చెబుతున్నారని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తాత్కాలికంగా డబ్బులు వచ్చినట్లు కనిపించినా దీర్ఘకాలంలో చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంతో ఎదుటి వ్యక్తులు, వీడియోలపైనే ఎక్కువగా ఆధారపడే స్వభావం అలవడుతుందని అంటున్నారు. దాంతో మార్కెట్ గురించి స్వతహాగా నేర్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వీడియోలు చూసి ట్రేడింగ్ చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
నిధులు మళ్లింపు.. అంబానీపై రూ.25 కోట్ల పెనాల్టీ
మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా అనిల్ అంబానీను, 24 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు అంబానీ రూ.25 కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై కూడా రూ.6 లక్షల జరిమానా విధించి, ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించింది.అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఆర్హెచ్ఎఫ్ఎల్) ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో సెబీ దర్యాప్తు జరిపి తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆరోపణల నేపథ్యంలో 222 పేజీలతో తుది ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ కీలక అధికారుల సహాయంతో అనిల్ అంబానీకి అనుసంధానం అయిన సంస్థలకు రుణాల రూపంలో నిధులు మళ్లించినట్లు సెబీ కనుగొంది. చిన్న కంపెనీలు నియమాలకు విరుద్ధంగా భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. వీరిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరితో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి కూడా మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పింది.ఇదీ చదవండి: పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..ఈ కేసుతో సంబంధం ఉన్న అంబానీతో పాటు మరో ముగ్గురికి చెందిన 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతర ఒక్కో సంస్థపై రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. -
సుభాష్ చంద్ర, పునీత్‌లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక యాజమాన్య పదవులు లేదా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకుండా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోపాటు ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధించింది. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. జీల్ చైర్మన్ చంద్ర, డైరెక్టరు గోయెంకా తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ప్రమోటర్ల వాటా 4 శాతం దిగువకు చేరినప్పటికీ చంద్ర, గోయెంకా జీల్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఉన్నట్లు తెలియజేసింది. -
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
‘ఇంటర్మీడియెట్ పూలింగ్’పై నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే దిశగా నిధులు, యూనిట్ల ’ఇంటర్మీడియట్ పూలింగ్’ను నిషేధించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. మ్యుచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు, చానెల్ భాగస్వాములు, ప్లాట్‌ఫామ్‌లు తదితర సంస్థలకు ఇది వర్తిస్తుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సెబీలో నమోదు చేసుకున్న పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు ఇది వర్తించదు. మ్యూచువల్ ఫండ్ సంస్థల (ఏఎంసీ)తో లోపాయికారీ ఒప్పందాలతో కొన్ని సంస్థలు .. తమ క్లయింట్ల నిధులను ముందు నోడల్ ఖాతాలోకి (ఇంటర్మీడియట్ పూలింగ్), ఆ తర్వాత ఏఎంసీల ఖాతాల్లోకి లావాదేవీల ప్రాతిపదికన బదలాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సెబీ తెలిపింది. ఇలాంటి అనధికారిక లావాదేవీల వల్ల యూనిట్హోల్డర్లు నష్టపోతే ఏఎంసీలే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పీల్‌కు కంపెనీ... అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్‌పై అప్పీల్‌కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్‌పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు. -
మాల్యాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సెబీ గట్టి షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మాల్యాపై నిషేధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్టాక్‌మార్కెట్లనుంచి మరో మూడేళ్ల పాటు నిషేధించింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌నుంచి అక్రమంగానిధులను మళ్లించిన ఈ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే లిస్టింగ్ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగకుండా మరో ఐదేళ్లపాటు నిషేధించింది. మాల్యాతో పాటు కంపెనీ మాజీ అధికారులు అశోక్ కపూర్, పిఎ మురళిపై ఒకసంవత్సరం బ్యాన్ విధించింది. అక్రమ లావాదేవీల వ్యవహారంలో చర్యల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ పూర్తికాలపు సభ్యులు జీ మహాలింగం వెల్లడించారు. జనవరి 2017 లో తాత్కాలిక ఆర్డర్ ద్వారా, అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసులో సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి మాల్యా, కపూర్, మురళి సహా యునైటెడ్ స్పిరిట్స్‌కు చెందిన ఆరుగురిపై మూడేళ్లపాటు నిషేధం విధించింది. మరోవైపు ఫార్ములా వన్ మోటార్ స్పోర్ట్ కంపెనీ ఫోర్స్ ఇండియా డైరెక్టర్ పదవికి మాల్యా రాజీనామా చేశారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, విచారణ నేపథ్యంలో కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా ‘ఫోర్సు ఇండియా’ డైరెక్టర్ పదవి చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాల్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
29 కంపెనీలపై సెబీ వేటు
సాక్షి, ముంబై: సెంట్రల్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 29 కంపెనీలపై నిషేధం విధించింది. ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ) పాటు మరో 28 కంపెనీలను మార్కెట్లనుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మోసపూరిత, అన్యాయమైన వాణిజ్య పధ్ధతుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ సంస్థల కార్యకలాపాలను బ్యాన్ చేసింది. మూడు సంవత్సరాలపాటు ఈ నిషేధం అమలు కానుంది. ముఖ్యంగా సెక్యూరిటీస్ అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎస్ఏటి) గత నెలలో సెబీకి జారీచేసిన తుదిఆదేశాల ప్రకారం సెబీ ఈ చర్య తీసుకుంది. 2012, 15 మార్చి నుంచి 2014 మార్చి 31 కాలంలో ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర, ట్రేడింగ్ వాల్యూమ్‌లో చోటుచేసుకున్న అసాధారణ పరిణామాలపై మార్కెట్ రెగ్యులేటరీ విచారణ చేపట్టింది. దీంతో 29 కంపెనీలపై మూడు సంవత్సరాలపాటు మార్కెట్లనుంచి తొలగించింది. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, కంఫర్ట్ గ్రూప్ డైరెక్టర్లు ప్రాథమికంగా తప్పుడు పద్ధతుల్లో మోసపూరిత పథకాన్ని లాంచ్ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారంటూ సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రిఫరెన్షియల్ ఎలాట్మెంట్ మార్గంలో కేవలం కొంతమంది వాటాదారులకే లబ్ది చేకూరేలా అక్రమ పద్ధతులను అవలంబించారని పేర్కొంది. అంతేకాదు ఇదే అంశంపై ఆదాయం పన్ను (ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్ జనరల్ నుంచికూడా సెబికి ఫిర్యాదులు అందాయి. ఎఫ్ఎఫ్ ఎస్ఎల్ , దాని అనుసంధానిత సంస్థలు తప్పుడు పథకాల ద్వారా, అక్రమ లావాదేవీలు, షేర్ ధర అమాంతం పెంపు లాంటి అక్రమాలు చోటు చేసుకున్నట్టు నివేదించింది. -
రిలయన్స్‌పై సెబీ కొరడా
⇒ ఎఫ్ అండ్ఓలో పాల్గొనకుండా ఏడాదిపాటు నిషేధం ⇒ రూ.1,300 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో 12 సంస్థలు డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా ఏడాది పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో రిలయన్స్ పెట్రోలియమ్(ఆర్పీఎల్)విలీనమైన సందర్భంలో ఆర్పీఎల్ షేర్లలో ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఐఎల్లో ఆర్పీఎల్ను విలీనం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం ఫ్యూచర్స్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ జరిపారని, ఈ లావాదేవీల్లో ఆర్ఐఎల్, ఇతర 12 సంస్థలు రూ.513 కోట్లు అక్రమ లాభాలు పొందాయని సెబీ ఆదేశాలు పేర్కొన్నాయి. ఇందుకు గాను ఆర్ఐఎల్, మరో 12 ఇతర సంస్థలు ఈక్విటీ డెరివేటివ్స్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకుండా సెబీ హోల్ టైమ్ మెంబర్ జి. మహాలింగమ్ నిషేధం విధించారు. అంతేకాకుండా రూ.513 కోట్ల అక్రమ లాభాలపై ఏడాదికి 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున రూ.1,300 కోట్లు 45 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొన్నారు. సెబీ నిషేధం విధించిన ఇతర 12 సంస్థలు.. గుజరాత్ పెట్‌కోక్, ఆర్తిక్ కమర్షియల్స్, ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్పోల్ ప్లాస్టిక్ ప్రొడక్టŠస్, ఫైన్ టెక్ కమర్షియల్స్, పైప్‌లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటెక్ సాఫ్ట్వేర్, దర్శన్ సెక్యూరిటీస్, రెలోజిస్టిక్స్(ఇండియా), రెలోజిస్టిక్స్(రాజస్థాన్), వినమర యూనివర్శల్, ధర్తి ఇన్వెస్ట్మెంట్ . కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిల్లేట్ ట్రిబ్యూనల్(శాట్)లో సవాల్ చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.