సాక్షి, ముంబై: సెంట్రల్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 29 కంపెనీలపై నిషేధం విధించింది. ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ) పాటు మరో 28 కంపెనీలను మార్కెట్లనుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మోసపూరిత, అన్యాయమైన వాణిజ్య పధ్ధతుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈ సంస్థల కార్యకలాపాలను బ్యాన్ చేసింది. మూడు సంవత్సరాలపాటు ఈ నిషేధం అమలు కానుంది.
ముఖ్యంగా సెక్యూరిటీస్ అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎస్ఏటి) గత నెలలో సెబీకి జారీచేసిన తుదిఆదేశాల ప్రకారం సెబీ ఈ చర్య తీసుకుంది. 2012, 15 మార్చి నుంచి 2014 మార్చి 31 కాలంలో ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర, ట్రేడింగ్ వాల్యూమ్‌లో చోటుచేసుకున్న అసాధారణ పరిణామాలపై మార్కెట్ రెగ్యులేటరీ విచారణ చేపట్టింది. దీంతో 29 కంపెనీలపై మూడు సంవత్సరాలపాటు మార్కెట్లనుంచి తొలగించింది. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎల్, కంఫర్ట్ గ్రూప్ డైరెక్టర్లు ప్రాథమికంగా తప్పుడు పద్ధతుల్లో మోసపూరిత పథకాన్ని లాంచ్ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారంటూ సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రిఫరెన్షియల్ ఎలాట్‌మెంట్ మార్గంలో కేవలం కొంతమంది వాటాదారులకే లబ్ది చేకూరేలా అక్రమ పద్ధతులను అవలంబించారని పేర్కొంది. అంతేకాదు ఇదే అంశంపై ఆదాయం పన్ను (ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్ జనరల్ నుంచికూడా సెబికి ఫిర్యాదులు అందాయి. ఎఫ్‌ఎఫ్ ఎస్‌ఎల్ , దాని అనుసంధానిత సంస్థలు తప్పుడు పథకాల ద్వారా, అక్రమ లావాదేవీలు, షేర్ ధర అమాంతం పెంపు లాంటి అక్రమాలు చోటు చేసుకున్నట్టు నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment